Haridwar Temple Stampede: హరిద్వార్‌లో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌(Haridwar temple)లో ఆదివారం (జులై 27) మానస దేవి ఆలయంలో ఘోర తొక్కిసలాట(stampede) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, దాదాపు 25 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఉదయం 9:30 గంటల సమయంలో ఆలయానికి వెళ్లే సిమెంటు మెట్ల మార్గంలో జరిగింది. శ్రావణ మాసం(Sravana Maasam)లో భక్తుల భారీ రద్దీ కారణంగా ఈ దుర్ఘటన సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆలయ మార్గంలో ఒక విద్యుత్ తీగలో కరెంటు ఉందనే వదంతి భక్తులలో భయాందోళనలకు దారితీసింది. ఈ గందరగోళంలో కొందరు భక్తులు(Devotees) వెనుకకు తిరిగి వెళ్లే ప్రయత్నంలో రద్దీ మరింత పెరిగి తొక్కిసలాటకు దారితీసింది.

6 Killed, Several Injured After Stampede Breaks Out At Mansa Devi Temple In  Haridwar

సీఎం పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి

ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రుకి తరలించారు, అయితే ఆరుగురు భక్తులు మృతి చెందినట్లు గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే నిర్ధారించారు. హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ మాట్లాడుతూ, రెండు కిలోమీటర్ల ఆలయ మార్గంలో రద్దీ కారణంగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ(CM Pushkar Singh Dhami) ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం (SDRF), పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *