
భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో ఆరంతస్తుల భవనానికి స్లాబ్ నిర్మాణం చేపట్టారు. అయితే దాన్ని అలాగే వదిలేశారు. కొంతకాలంగా అలాగే ఉన్న ఆ భవనం బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.
ఆరుగురు మృతి
భవనం కుప్పకూలిన ఘటనలో పలువురు గాయపడ్డారు. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, వైద్య సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే భవనం కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రొక్లెయిన్ల సాయంతో ప్రస్తుతం సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు.