ఐర్లాండ్(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్ఫోర్డ్లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్ వీడి, ఇండియా(India)కు వెళ్లు అంటూ పాప ప్రైవేటు పార్టుల్లో సైకిళ్లతో తొక్కించారు. ఐర్లాండ్లో భారతీయ సంతతి పసివారిపై ఇటువంటి జాత్యాహంకార దాడి కేసు(Racist attack case) నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు పలుచోట్ల భారతీయులపై అనేక రకాల దాడులు జరిగాయి. తన స్నేహితులతో కలిసి ఇంటి ముందే ఆడుకుంటూ ఉండగా పాపపై అక్కడి బాలలు పైశాచికానికి దిగారు.
పాప భయంతో బయటకి వెళ్లలేకపోతోంది..
తమ పాపపై దాడికి దిగిన వారిలో ఓ బాలిక, పలువురు అబ్బాయిలు ఉన్నారని తల్లి(Girl’s Mother) స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో తన పదినెలల కొడుకుకు ఆహారం పెడుతూ ఉండగా, బయట ఉన్న తన కూతురిపై దాడి జరిగిందని, ఆమె కేకలు, ఏడుపుతో విషయం తెలిసిందని వివరించారు. ఆమె ముఖంపై కూడా కొట్టారని బాధతో విలవిలలాడుతూ ఇంటికి వచ్చిందని చెప్పారు. తన జుట్టుపట్టి లాగారని, వెనుక నుంచి కింది భాగంలోకి సైకిల్ తోశారని బాలిక తెలిపింది. రెండు రోజులుగా బాలిక భయంతో వణికిపోతోంది. ఎక్కువగా మాట్లాడలేకపోతోంది. ఇల్లు గుమ్మం దాటి వెళ్లలేకపోతోందని తల్లి వాపోయింది.
𝐆𝐨 𝐛𝐚𝐜𝐤 𝐭𝐨 𝐈𝐧𝐝𝐢𝐚: 𝟔‑𝐲𝐞𝐚𝐫‑𝐨𝐥𝐝 𝐈𝐧𝐝𝐢𝐚𝐧‑𝐨𝐫𝐢𝐠𝐢𝐧 𝐠𝐢𝐫𝐥 𝐚𝐬𝐬𝐚𝐮𝐥𝐭𝐞𝐝 𝐢𝐧 𝐈𝐫𝐞𝐥𝐚𝐧𝐝
A 6‑year‑old Indian‑origin girl in Waterford, Ireland, was assaulted by a group of boys who punched her, hit her private parts with a bicycle, and hurled… pic.twitter.com/b7tr7lPbVN
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 7, 2025







