కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) మళ్లీ బుల్లితెరపై మెరిసారు. 25 ఏళ్ల క్రితం ఆమెకు స్టార్‌డమ్ తీసుకొచ్చిన హిందీ సీరియల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ కి సీక్వెల్ గా వస్తున్న ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ ద్వారా మరోసారి తులసి విరానీగా తిరిగొచ్చారు. ఈ సీరియల్ జూలై 29 నుంచి ప్రసారం అవుతోంది.
ఇప్పటికే తాను ఫుల్‌టైమ్ రాజకీయ నాయకురాలు, పార్ట్‌టైమ్ యాక్ట్రెస్ అని పేర్కొన్న స్మృతి ఇరానీ, తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ సీరియల్ కోసం ఒక్కో ఎపిసోడ్‌కు రూ.14 లక్షలు రెమ్యునరేషన్( remuneration) అందుకుంటున్నట్టు తెలిపారు. ఇది భారత టెలివిజన్ రంగంలో ఏకంగా అత్యధిక పారితోషికంగా నిలిచింది.
ఇంతకు ముందు ఈ కిరీటం ‘అనుపమ’ ఫేమ్ రూపాలీ గంగూలీకి ఉండేది. ఆమె ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3 లక్షలు తీసుకునేవారు. అలాగే హీనా ఖాన్ రూ.2 లక్షలు తీసుకునే వారు. అయితే ఇప్పుడు స్మృతి వాటిని గణనీయంగా అధిగమించారు. స్మృతి పేర్కొన్న విధంగా, “పనిని కేవలం డబ్బు కోసమే కాకుండా, ఆశయం కోసం చేస్తేనే నిజమైన విజయాన్ని పొందగలము. నిరంతరం శ్రమిస్తూ ఉండాలనే తపన ఉండాలి” అని తెలిపారు.
2000లో ప్రారంభమైన ఆదిరాజా సీరియల్ మొదటి భాగం 2008 వరకు విజయవంతంగా ప్రసారమైంది. ఇప్పుడు అదే సీరియల్‌కు సీక్వెల్‌గా వస్తున్న రెండో భాగంలో స్మృతి పాత్ర మరింత శక్తివంతంగా ఉండబోతుందని చెబుతున్నారు. తన నటనతో గతంలోనూ అద్భుత స్పందన పొందిన స్మృతి, ఇప్పుడు మరోసారి ఆ గుర్తింపును మించేందుకు సిద్ధంగా ఉన్నారు.






