టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) త్వరలోనే నటుడిగా తెరంగేట్రం చేయనున్నారనే వార్తలు గత కొంతకాలంగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. రిలీజ్ అయిన ఖాఖీ-2 (khakee 2) వెబ్ సిరీస్ పోస్టర్ ఈ పుకార్లకు మరింత బలం చేకూరుస్తోంది. ఆయన పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో త్వరలోనే గంగూలీని తెరపై చూడొచ్చంటూ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
గంగూలీ ఓటీటీ ఎంట్రీ
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఖాకీ ది బిహార్ చాప్టర్ (khakee the bihar chapter)’కు కొనసాగింపుగా ‘ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ (khakee the bengal chapter)ను మేకర్స్ రూపొందించారు. జీత్, ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, శాశ్వత, పరంబ్రత ఛటర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా మార్చి 20వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో గంగూలీ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్తలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Kolkata ke sabse khatarnaak gangsters ka hoga sabse shaatir police se saamna, in Khakee: The Bengal Chapter🔥
Khakee: The Bengal Chapter is coming soon, only on Netflix!#KhakeeTheBengalChapter#KhakeeTheBengalChapterOnNetflix#NextOnNetflixIndia pic.twitter.com/cVlJlK9rnV— Netflix India (@NetflixIndia) February 3, 2025
పోలీసుగా సౌరవ్ గంగూలీ
బుధవారం రోజున ఈ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో నిర్మాత నీరజ్ పాండే (Neeraj Pandey) చేసిన కామెంట్స్ కూడా సౌరవ్ గంగూలీ ఓటీటీ ఎంట్రీ వార్తలకు బలాన్నిస్తున్నాయి. ‘ఈ సిరీస్‌లో గంగూలీ ఉన్నారా?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘ఆ విషయం చెప్పడం ఎందుకు సిరీస్ రిలీజ్ అయ్యాక మీరే చూడండి’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. దీంతో గంగూలీ సినీరంగ ప్రవేశం ఖాయమని నెటిజన్లు భావిస్తున్నారు.
గంగూలీ బయోపిక్
మరోవైపు సౌరభ్ గంగూలీ బయోపిక్(Sourav Ganguly Biopic) త్వరలో వెండితెర పైకి రానున్న విషయం తెలిసిందే. అతడి బయోపిక్ కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు ఇందులో గంగూలీ పాత్రలో నటించనున్నాడు. ‘నేను విన్నంతవరకు.. టైటిల్ రోల్‌లో రాజ్‌కుమార్ రావ్ (Rajkummar Rao) నటించనున్నారు’ అని మాజీ క్రికెటర్ స్వయంగా వెల్లడించారు.






