ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2025)కు రంగం సిద్ధమైంది. ఇవాళ ఇంగ్లండ్‌లోని క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్(Lords) మైదానంలో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా(South Africa vs Australia) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు గత రెండేళ్లుగా సాగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో టాప్-2లో నిలిచిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి 15 వరకు జరిగే ఈ మ్యాచ్‌కు జూన్ 16ను రిజర్వ్ డే(Reserve Day)గా కేటాయించారు. వర్షం(Rain) లేదా ఇతర కారణాల వల్ల నష్టపోయిన ఆటను రిజర్వ్ డే రోజు ఆడిస్తారు.
వరుసగా రెండోసారి ఫైనల్‌కు ఆస్ట్రేలియా
కాగా WTC-2023 ఫైనల్లో భారత్(India)ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా(Australia).. వరుసగా రెండో టైటిల్ గెలవడంపై ఫోకస్ పెట్టింది. మరోవైపు తొలిసారి ఫైనల్ చేరిన సౌతాఫ్రికా(South Africa) మొట్ట మొదటి ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ డ్రా అయితే ఇరు జట్లు టైటిల్‌ను షేర్ చేసుకోనున్నాయి. డబ్ల్యూటీసీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఫైనల్ మ్యాచ్ కూడా డ్రా అవ్వలేదు. టెస్ట్ క్రికెట్ ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో 2019లో ఐసీసీ ఈ ఛాంపియన్‌షిన్‌ను ప్రవేశ పెట్టింది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇలా..
ఇప్పటి వరకు టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు 101 మ్యాచ్‌లు ఆడాయి. 54 విజయాలతో ఆస్ట్రేలియా పైచేయి సాధించగా.. సౌతాఫ్రికా 26 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో 21 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు లేదు. ఐదు రోజుల పాటు ఆట సజావుగా సాగనుంది. కవేళ వర్షంతో అంతరాయం కలిగినా.. రిజర్వ్ డే ఉంది. వాతావరణం వేడిగా ఉంటే మాత్రం స్పిన్నర్లు కీలకంగా మారనున్నారు.
WTC FINAL 2025 playing XI of both teams pic.twitter.com/wjyESZ0OAg
— Cricket Insight (@cricketinsightt) June 10, 2025
తుది జట్లు ఇవే..
South Africa: ఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా (C), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్ (Wk), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, లుంగి ఎంన్గిడి.
Australia: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (Wk), పాట్ కమిన్స్ (C), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.






