
దేశ వ్యవసాయ రంగానికి చల్లని కబురు వచ్చింది. శనివారం కేరళలోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఎంట్రీ ఇచ్చాయి. దాదాపు వర్షాకాలం ఎంటర్ లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈ సారి అనుకున్న సమయం కంటే ఎనిమిది రోజుల ముందుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం (India Meteorological Department) తెలిపింది. రెండు మూడు రోజుల్లోనే ఏపీ, తెలంగాణకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ సమయంలో రెండు రాష్ట్రాల్లో వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
16 ఏళ్ల తర్వాత ఎనిమిది రోజుల ముందుగా..
ఎప్పుడూ మే చివరి వారం లేదా జూన్ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి. కానీ ఈ సారి మాత్రం మే 24న రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలా ముందుగానే కేరళను (Kerala) రుతుపవనాలు తాకడం 16 సంవత్సరాల్లో మొదటి సారి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం మే 30, 2023 లో జూన్ 8న భారత్ లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈ సారి మాత్రం మే 24నే కేరళలోని ఎంట్రీ ఇచ్చాయి. గతంలో 2009 మే 23న నైరుతి రుతుపవనాలు కేరళను తాకగా.. ఇన్ని సంవత్సరాలకు మళ్లీ ఎనిమిది రోజులు ముందుగానే రావడంతో రైతన్నలు హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఈసారి అధిక వర్షపాతమే
మన దేశంలో దాదాపు 50 శాతం కంటే ఎక్కువ భూమి సాధారణ వర్షపాతం మీదనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఈ సారి భారత్ లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం ఉంటుందని వాతావరణ నిపుణలు చెబుతున్నారు.
ఇటు అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు (Widespread Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.