డిసెంబర్ 26న ‘స్క్విడ్ గేమ్ 2’

స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ (Squid Game) చూసిన వాళ్లకు ఆ రోజు నిద్ర మాత్రం పట్టదు. ఈ సిరీస్ చూసిన ఎవరినీ అడిగినా అదే చెబుతారు. అంతలా భయపెడుతుంది. ఆశ పెడుతుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది. డబ్బు కోసం ఎవరూ ఏదైనా చేయడానికి సిద్ధపడే దారుణమైన ఆటను క్రూరంగా చూపిస్తూనే ఎమోషన్ పలికించే ఈ వెబ్ సిరీస్ కోసం ప్రతి ఒక్క ఓటీటీ ప్రియుడు ఎదురు చూస్తున్నాడు.

నెట్ ఫ్లిక్స్ లో
ఏదైనా ఆటలో ఓడిపోతే, మళ్లీ ఆడి గెలవచ్చు. కొన్ని ఆటలు గెలిచే వరకూ ఆడవచ్చు. కానీ, ‘స్క్విడ్ గేమ్’లో ఓడిపోతే, ఎలిమినేట్ అయిపోతారు. ఆటలోనే కాదు, భూమ్మీద నుంచి శాశ్వతంగా. ‘డబ్బు’ కొందరికి అవసరం.. మరికొందరికి వ్యసనం.. ఇంకొందరికి వినోదం.. ఈ మూడు కలిసిన వెబ్ సిరీస్ ’ స్క్విడ్ గేమ్. (Squid Game) ఇది నెట్ ఫ్లిక్స్ లో 2021 లో స్ట్రీమింగ్ కాగా.. దీనికి వచ్చిన విశేష ఆదరణ అంతా ఇంతా కాదు. నెట్ ఫ్లిక్స్ (Netflix) కు ఇది ఒక ఆదాయ వనరు అంటే నమ్మశక్యంగా ఉండదు. అంతలా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది. వివిధ అవార్డులను సైతం అందుకుంది.

స్క్విడ్ గేమ్ 2 కోసం ఎదురు చూపులు
ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తొలి భాగానికి సీక్వెల్ గా ‘స్క్విడ్ గేమ్ 2’ (Squid Game 2) డిసెంబరు 26వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా అలరించిన తొలిభాగంలో ఏం జరిగింది. ఈ కొరియన్ (Korean Movies) థ్రిల్లర్ జనాలకు నచ్చడానికి కారణమేంటి? దీన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు పడిన కష్టాలేంటి? ఇంతకీ కథేంటంటే.. జీవితంలో సర్వస్వం కోల్పోయి, అప్పుల పాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే ఆటల పోటీలు నిర్వహిస్తారు. ఇలాంటివి మొత్తం ఆరు పోటీలుంటాయి. వీటిలో విజేతలుగా నిలిచిన వారికి మొత్తం 45.6 బిలియన్ కొరియన్ వన్ (39 మిలియన్ డాలర్లు) గెలుచుకోవచ్చు. అన్ని సులభమైనవి, సరళమైన ఆటలే. కానీ, ఇక్కడే ఒక చిక్కుంది. ఈ ఆటలో ఓడిపోయినవారు పోటీ నుంచి శాశ్వతంగా ఎలిమినేట్ అవుతారు. ఆటలోంచే కాదు, జీవితం నుంచే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఓడిపోతే చంపేస్తారని అర్థం. మరి రెండో భాగం డిసెంబర్ 26 న రిలీజ్ కానుండటంతో అందరూ వేయి కళ్లతో (Squid Game 2) ఎదురు చూస్తున్నారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *