ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) వేదికగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game). కొరియన్ భాషలో తెరకెక్కిన ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రెండు సీజన్‌లు విడుదలై ప్రేక్షకులను మెప్పించాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్రాంచైజీలో రాబోతున్న చివరి సిరీస్ ‘స్క్విడ్‌గేమ్ 3’ (Squid Game 3) ట్రైలర్‌ను తాజాగా టీమ్ విడుదల చేసింది. ఈ ఆటకు ఎలాగైనా ముగింపు పలకాలనే లక్ష్యంతో ఉన్న షియెంగ్ జీ హున్.. ఫ్రంట్‌మ్యాన్‌ను అంతం చేశాడా.. లేదా అనేది ఈ సీజన్‌లో చూపనున్నారు. జూన్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఉత్కంఠరేపుతోన్న ట్రైలర్‌ను మీరూ చూసేయండి.






