టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల(Sreeleela) బాలీవుడ్‌లోనూ తన జోరు చూపించడానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సరసన ఈ బ్యూటీ ఓ భారీ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ‘పుష్ప 2’ స్పెషల్ సాంగ్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శ్రీలీల, ఇప్పుడు హిందీ చిత్రసీమలో కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో రణబీర్ కపూర్‌తో జోడీ కట్టనున్న శ్రీలీల, తన నటన, నృత్య ప్రతిభతో బాలీవుడ్(Bollywood) ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.
‘ఆషికీ 3’లో నటిస్తున్న శ్రీలీల
ఈ చిత్రం ఓ యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్(Action, romantic entertainer)గా రూపొందనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ(Director Rajkumar Hirani) ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించే అవకాశం ఉందని, ఇందులో శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో నటుడు బాబీ డియోల్(Boby Deol) కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan) సరసన ‘ఆషికీ 3’లో నటిస్తున్న శ్రీలీల, రణబీర్‌తో ఈ చిత్రంతో మరింత గుర్తింపు సాధించే అవకాశం ఉంది.

జూనియర్‌తో కన్నడ ఇంస్ట్రీలోకి..
శ్రీలీల ఇటీవల ‘జూనియర్(Junior)’ చిత్రంతో కిరీటితో కన్నడలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆమె డ్యాన్స్, ఎనర్జీ, అభినయం బాలీవుడ్ నిర్మాతలను ఆకర్షించాయని, అందుకే వరుసగా ఆఫర్లు వస్తున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉందని, శ్రీలీల రెమ్యూనరేషన్(Sreeleela Remuneration) కూడా భారీగా ఉంటుందని టాక్. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, శ్రీలీల బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశం ఉంది.






