టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి నుంచి ఈ బ్యూటీ తీరిక లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి ఆఫర్లు వరుస కడుతున్నాయి. ఇక కేవలం టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ శ్రీలీల బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ రవితేజతో ‘మాస్ జాతర’, నితిన్ తో ‘రాబిన్ హుడ్ (Robin Hood)’, పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అలాగే తమిళ్ లో శివకార్తికేయన్ తో ‘పరాశక్తి’ అనే సినిమాలు చేస్తోంది.
బోల్డ్ పాత్రకు శ్రీలీల జై
అయితే ఈ బ్యూటీ ఇప్పటివరకు బబ్లీ గర్ల్ రోల్స్ మాత్రమే చేసింది. ఇంటెన్స్ పాత్రలకు, రొమాంటిక్ స్టోరీలకు కాస్త దూరంగా ఉంది. వెస్టర్న్ పాత్రల్లో అలరించినా.. డ్రెస్సింగ్ విషయంలో ఎప్పుడూ గీత దాటలేదు. అయితే తాజాగా శ్రీలీల ఓ బోల్డ్ పాత్రకు ఓకే చెప్పిందట. టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్రేజీ థ్రిల్లర్ మంగళవారం (Mangalavaaram) సినిమా గుర్తుంది కదా. దీనికి సీక్వెల్ చేయనున్నట్లు ఇటీవలే డైరెక్టర్ అజయ్ భూపతి ప్రకటించిన విషయం తెలిసిందే.
సూపర్ హిట్ సీక్వెల్ లో ఛాన్స్
ఇప్పుడు ఈ సీక్వెల్ (Mangalavaaram 2) లో శ్రీలీల నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంగళవారం చిత్రంలో పాయల్ రాజ్ పుత్ విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆర్ఎక్స్ 100తో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ మంగళవారం సినిమాతో మంచి నటి అని ప్రూవ్ చేసుకుంది. ఇక బబ్లీ గర్ల్ ఇమేజ్ తో ఉన్న శ్రీలీల ఇప్పుడు ఈ సీక్వెల్ లో పాయల్ లా విశ్వరూపం చూపిస్తే గనుక ఈ భామకు ఇక తెలుగు తెరపై తిరుగులేకుండా పోతుందని నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






