Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ను పాన్ ఇండియా స్టార్ చేసిన మూవీ పుష్ప. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్ ‘పుష్ప ది రూల్’ (Pushpa the Rule) వస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి తరచూ అప్డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా పుష్ప-2 మూవీ గురించి మరో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగానే సుకుమార్ సినిమాలు అంటే స్పెషల్ సాంగ్స్ కు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఇక పుష్ప మూవీలోని ఊ అంటావా మావా సాంగ్ కు ఎంతటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఈ పాటలో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సెన్షువస్ స్టెప్పులు కుర్రాళ్లను ఉర్రూతలూగించాయి.
ఇక పుష్ప-2లో కూడా అంతకుమించి స్పెషల్ సాంగ్ ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఇందులో ఎవరు కనిపించనున్నారనే విషయంలో ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. పుష్ప ది రూల్ లోని స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor)ను సుకుమార్ సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఆ పాట కోసం భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆమె ఈ టీమ్‌లో భాగం కాలేకపోయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే చిత్ర బృందం శ్రీలీలను సంప్రదించినట్లు సమాచారం.
ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. శ్రీలీల (Sreeleela) సూపర్ డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి తెలియని వారుండరు. ఈ ఇద్దరి కాంబోలో ఓ సాంగ్.. అది కూడా స్పెషల్ నంబర్ వస్తే థియేటర్లు ఊగిపోవాల్సిందేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక థియేటర్లలో మాస్ జాతర పక్కా, పూనకాలు రావాల్సిందే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది నిజమైతే చాలా బాగుంటుందంటూ చర్చిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ – శ్రీలీల ఇప్పటికే ఓ యాడ్ కోసం వర్క్ చేశారు.






