Srileela: బాలీవుడ్‌లోకి శ్రీలీల.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్‌(Tollywood)లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్న శ్రీలీల(Srileela) ఇటీవలే కోలీవుడ్‌(Kollywood) సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో శ్రీలీల జోరు మామూలుగా లేదు. అల్లు అర్జున్‌(Allu Arjun)తో కలిసి పుష్ప-2లో వేసిన “కిస్సిక్ డాన్స్‌”తో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి డాన్సర్‌(Dancer)గా ఈ అమ్మడికి మంచి గుర్తింపు దక్కడంతో మరిన్ని సినిమాల్లో ఆఫర్లు(Offers) వస్తున్నాయి. అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడు చేస్తున్న సినిమాల సంఖ్య చాలా ఉన్నాయి. తాజాగా బాలీవుడ్‌(Bollywood)లోనూ ఈ అమ్మడు అడుగు పెట్టేందుకు రెడీ అయింది.

బాలీవుడ్‌లో అవకాశం కోసం ఎదురుచూపులు

బాలీవుడ్ యంగ్‌ హీరో కార్తీక్ ఆర్యన్‌(Karthik Aryan) హీరోగా రూపొందబోతున్న ఒక సినిమాలో శ్రీలీలను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. మొదట ఆ పాత్రకు యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ(Tripti Dimri)ని ఎంపిక చేశారు. కానీ ఆ పాత్రలో త్రిప్తి కంటే శ్రీలీల అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేకర్స్‌ ఈ నిర్ణయానికి వచ్చారు అంటూ హిందీ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న ఎంతో మంది హీరోయిన్స్ బాలీవుడ్‌లో ఒక్క అవకాశం అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది శ్రీలీల వెయిట్‌ చేయకుండానే బాలీవుడ్‌లో నటించే అవకాశం దక్కింది.

రెమ్యునరేషన్‌పై ఆసక్తికర ప్రచారం

శ్రీలీల బాలీవుడ్‌లో మొదటి సారి నటించబోతున్న నేపథ్యంలో ఆమె రెమ్యునరేషన్(Remuneration) గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. పుష్ప-2 సినిమాలో కిస్సిక్‌ సాంగ్‌ను చేసేందుకు గాను శ్రీలీల ఏకంగా రూ.2 కోట్ల పారితోషికం తీసుకుంది. అలాంటిది బాలీవుడ్‌లో సినిమాకు రూ.4 కోట్లు అందుకుంటూ ఉంటుందని అంతా భావిస్తున్నారు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీల తన మొదటి హిందీ సినిమాకు గాను కేవలం రూ.1.75 కోట్లను మాత్రమే పారితోషికంగా అందుకుంటుందట. మొదటి హిందీ సినిమా కావడంతో ఈ అమ్మడికి తక్కువ ఇస్తున్నారని టాక్‌.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *