అవినీతి నిరోధక సంస్థ తెలంగాణ రాష్ట్ర వైస్ ఛైర్మన్ గా జనగాం శ్రీనివాస చారి నియామకమయ్యారు. హబ్సిగూడ డివిజన్ గోకుల నగర్ కు చెందిన శ్రీనివాస చారికి ఏసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు నియామక పత్రాన్ని అందజేశారు. నూతన వైస్ చైర్మన్ గా ఎన్నికైన శ్రీనివాసచారి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, న్యాయ సంస్థలకు సమన్వయ కర్తగా పనిచేస్తానని అన్నారు. జాతీయ అధ్యక్షుడు సంజీవ్ శర్మకు చారి.. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






