హీరో శ్రీవిష్ణు(Sree Vishnu), కేతిక శర్మ జోడీగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సింగిల్'(Single Movie). ఈనెల 9న భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆటలోనే సూపర్ హిట్ టాక్‌ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్‌లో అల్లు అరవింద్(Allu Aravind) శ్రీవిష్ణుకి మరో రెండు సినిమాలు చేసేందుకు చెక్కులు కూడా ఇచ్చేశాడట. డైరెక్టర్ కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈ మూవీలో ఇవానా, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రభాస్ శ్రీను, రెబా మోనిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
రెండో వీకెండ్‌లోనూ సూపర్ క్రేజ్
ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సూపర్ హిట్ అయ్యి నిర్మాతల(Producers)కు భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాలను చేతివేళ్లతో లెక్కపెట్టొచ్చు. వాటిల్లో సింగిల్ చిత్రం(Single Movie) కూడా చేరుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.కేవలం వీకెండ్‌లోనే కాదు, వర్కింగ్ డేస్‌లో కూడా స్టడీ కలెక్షన్స్(Collections)ని నమోదు చేసుకున్న ఈ చిత్రం రెండో వీకెండ్‌లో కూడా మంచి వసూళ్లను రాబట్టి బయ్యర్స్‌కి మరింత లాభాలను తెచ్చి పెట్టింది. ఓవరాల్‌గా పది రోజులకు గాను ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుంచి 10 కోట్ల 96 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

అలాగే వరల్డ్ వైడ్‌గా 14 కోట్ల 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు 27 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్(Full Run) పూర్తి అయ్యే సరికి మరో మూడు కోట్ల రూపాయిల లాభాలు రావొచ్చు. బాక్స్ ఆఫీస్ టర్మ్స్ ప్రకారం ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిల్చింది.






