రామ్ చరణ్ (Ram Charan) , శంకర్ (Shankar) కాంబోలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్రైలర్ ను ఇవాళ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రిలీజ్ చేసారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా అడ్వాణీ హీరోయిన్. శ్రీకాంత్, అంజలి, నవీన్‌చంద్ర, సముద్రఖని, ఎస్.జె. సూర్య కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రాజమౌళి (SS Rajamouli) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.
శంకర్ మా అందరికీ ఓజీ
ఇది శంకర్ ఫస్ట్ తెలుగు మూవీనా? అని ట్రైలర్(Game Changer) చూస్తే సందేహంగా అనిపిస్తోందని రాజమౌళి అన్నారు. శంకర్ తెలుగు డైరెక్టరేనని.. ఆయనంటే ప్రేక్షకులకే కాదు సినిమా వాళ్లకూ అభిమానం, గౌరవం అని తెలిపారు. ఆ గౌరవంతో దిల్ రాజు మీతో సినిమా చేసి ఉంటారని పేర్కొన్నారు. ఈ తరం దర్శకులు ఆయణ్ను చూసి గర్వంగా ఫీలవుతుంటారని.. దర్శకులందరికీ ఆయన ఓజీ (Original Gangster) అని వ్యాఖ్యానించారు. తనతో సహా ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు.
దానికి చరణ్ నా అనుమతి తీసుకోవాల్సిందే
‘‘మన పెద్ద కలలను తెరపై ఆవిష్కరించేందుకు భయపడాల్సి అవసరం లేదు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో వింటేజ్ శంకర్ ను చూడొచ్చు. శంకర్ చిత్రాల్లో ‘ఒకే ఒక్కడు’ నాకు చాలా ఇష్టం. ‘గేమ్ ఛేంజర్’లోని ఓ సీన్ ఒకే ఒక్కడులోని కీలక సీన్ ను గుర్తుచేసేలా ఉంది. మగధీర సమయంలో రామ్ చరణ్‌ను నేను హీరో అని పిలుస్తుండేవాడిని. చరణ్ అని పిలవడం తనకు ఇష్టం ఉండదు రామ్ అంటేనే నచ్చుతుంది. చరణ్ తో గుర్రపు స్వారీ సీన్స్ చేయాలంటే ఎవరైనా నా అనుమతి తీసుకోవాల్సిందే. వాటిపై నాకే అన్ని హక్కులు ఉన్నాయి.’’ అని జక్కన్న సరదాగా అన్నారు.
Rajamouli
Ram Charan
Horse Riding… 🐎🥵🔥Match Made In Heaven 🐎🥵🔥#RamCharan #GlobalStarRamCharan #GameChanger pic.twitter.com/bsw8JYX6tN
— EshwaRC15 Raj(Dhfc) 🚁🚁 (@EshwarDhfc) January 2, 2025






