మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. ఈ సినిమా సంక్రాంతి(Sankranti) కానుకగా జనవరి 10న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్(Teaser), సాంగ్స్(Songs) ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు మేకర్స్ ప్రమోషన్స్(Promotions)ని కూడా ఓ రేంజ్‌లో చేస్తున్నారు. దీంతో ఈ యాక్షన్ డ్రామా మూవీ కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక నిన్న ఉదయం మేకర్స్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ అప్డేట్(Trailer Update) ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం (జనవరి 2) సాయంత్రం 5.04 గంటలకి రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించి మరో న్యూస్ బయటికొచ్చింది.
గ్రాండ్‌గా నిర్వహించాలనుకున్నారు.. కానీ!
అయితే గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించాలనుకున్నారట. కానీ, పుష్ప-2(Pushpa-2) బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్(Sandya Theatre Incident) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులతో సింపుల్ ఈవెంట్‌గా నిర్వహిస్తున్నారు. దీంతో హైదరాబాద్(Hyd)లోని ఓ మల్టిప్లెక్స్ థియేటర్‌లో సింపుల్‌గా ఈ ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ఇక ఈవెంట్‌కు చరణ్, శంకర్, దిల్ రాజు, SJ సూర్యతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
Drum roll, please 🥁
The one and only @ssrajamouli is making a spectacular entry at the #GameChangerTrailer launch on January 2nd! 😎💥
See you tomorrow at 5:04 PM!#GameChanger#GameChangerOnJAN10 🚁 pic.twitter.com/3tupztFDqF
— Game Changer (@GameChangerOffl) January 1, 2025
చీఫ్ గెస్ట్‌గా జక్కన్న
ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రాజమౌళి(Rajamouli) ముఖ్య అతిథిగా రానున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు. రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో చరణ్ మగధీర, RRR సినిమాలు చేసి భారీ హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అంజలి, కియారా అద్వానీ, శ్రీకాంత్, నవీన్ చంద్ర, SJ సూర్యతో పాటు పలువురు స్టార్స్ నటిస్తున్నారు.






