టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. #SSMB29 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రాజమౌళి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. సింహాన్ని లాకప్ లో లాక్ చేసినట్లు వీడియో చేశారు. పాస్‌పోర్ట్ చూపిస్తూ ఫొటోకు పోజ్ ఇచ్చి సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు.
జక్కన్న పోస్టు.. మహేశ్ బాబు రియాక్షన్
రాజమౌళి పోస్టుతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లేనని అభిమానులు అనుకుంటున్నారు. ఈ వీడియోకు రాజమౌళి (SS Rajamouli) ‘క్యాప్చర్’ అనే క్యాప్షన్ పెట్టగా.. ఈ పోస్టుపై మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా స్పందించడంతో మహేశ్ బాబు, జక్కన్న సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా ఫిక్స్ అని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. ఇక ఈ పోస్టుపై మహేశ్ బాబు ‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’’ అంటూ పోకిరి డైలాగు కామెంట్ చేశారు.
ప్రియాంకా చోప్రాయే హీరోయిన్
మరోవైపు మొత్తానికి షూటింగ్ ప్రారంభమైంది అని అర్థం వచ్చేలా ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. ఫైనల్లీ అంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నా.. ఇటీవల ఆమె హైదరాబాద్ రావడంతో అభిమానులు ఈ సినిమా కోసమే వచ్చారని ఫిక్స్ అయ్యారు. ఇక తాజాగా జక్కన్న పోస్టుకు కామెంట్ పెట్టడంతో ఇక ప్రియాంకానే మహేశ్ హీరోయిన్ అని కన్ఫామ్ చేసేశారు.
#SSRajamouli posts a funny video of a lion being locked up in a cage and then shows a passport suggesting he has locked up #MaheshBabu and will prevent him from travelling abroad until he completes #SSMB29.
Mahesh Babu responds to the Instagram post with his #Pokkiri dialogue -… pic.twitter.com/ji6ZZafFvW
— Cinemania (@CinemaniaIndia) January 24, 2025
అమెజాన్ అడవుల నేపథ్యంలో సినిమా
మహేశ్- రాజమౌళి కాంబోలో రానున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని సినీ లవర్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. #SSMB29 వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే మహేశ్ లుక్ మార్చారు. ఇక ఈ సినిమాలో ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఉన్న జంతువుల కంటే ఎక్కువ యానిమల్స్ ఉంటాయని రాజమౌళి ఓ ఈవెంట్‌లో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు (ssmb29 Latest Update) కనిపించనున్నారు.
Priyanka Chopra comment chesindhi
Finally my dream pair 😭🔥🥳🥳🥳#SSMB29 pic.twitter.com/XGumYbXmOP— RAM (@basically_clasy) January 24, 2025






