టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో ఎస్ఎస్ రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ ల మధ్య సన్నివేశాలను జక్కన్న తెరకెక్కిస్తున్నారు. అయితే ఒడిశా మూవీ సెట్ నుంచి ఇప్పటికే కొన్ని ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి.
సెట్ లో రాజమౌళి ఆంక్షలు
SSMB29 నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న జక్కన్న(SS Rajamouli).. ఈ సినిమా ఫొటోలు లీక్ కావడంతో అలర్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ సెట్ లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాడట. ఇప్పటికే టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన రాజమౌళి సినిమా సీన్లు లీక్ (SSMB29 Photos Leak) కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాడట. అయితే ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్న నటీనటులు, సిబ్బంది నుంచి మొబైల్ ఫోన్లు తీసుకున్న తర్వాతే వారిని సెట్లోకి అనుమతిస్తున్నాడట.
నయా రూల్ తో మైండ్ బ్లాక్
అంతేకాదు తాజాగా జక్కన్న సెట్లో మరో కొత్త రూల్ పెట్టాడట. ఈ రూల్ ప్రకారం నటీనటుల వ్యక్తిగత స్టాఫ్ లో ఒకరిద్దరిని మించి సెట్లోకి అనుమతించడం లేదట. మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ ముగ్గురూ ఆయా ఇండస్ట్రీల్లో స్టార్ నటులు. వారి వ్యక్తిగత స్టాఫ్ లో కనీసం 8 నుంచి 10 మంది సిబ్బంది ఉంటారు. అయితే జక్కన్న నయా రూల్ తో ఇప్పుడు కేవలం ఒకరిద్దరిని సెట్లోకి అనుమతిస్తుండటంతో సదరు స్టార్లు కాస్త ఇబ్బంది పడుతున్నారట. కానీ వాళ్లు రాజమౌళి రూల్ కు తలొంచక తప్పడం లేదు.






