ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తన తర్వాత ప్రాజెక్టును టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో కలిసి చేస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే జక్కన్న మాత్రం అనౌన్స్మెంట్ తప్ప ఆ తర్వాత ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్స్ ఏం ఇవ్వలేదు. కానీ ఈ సినిమా షూటింగును మాత్రం శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
SuperStar @urstrulyMahesh after wrapping the Odisha schedule for #SSMB29 had meeting with local authorities pic.twitter.com/T6W5xQizUy
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2025
ఒడిశా షెడ్యూల్ కంప్లీట్
ప్రస్తుతం ఈ చిత్రం ఒడిశా షెడ్యూల్ (SSMB29 Odisha Schedule) పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. గత 15 రోజుల నుంచి ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో షూటింగ్ జరుపుకుంది. సిమిలిగూడ సమీపంలోని మాలి, పుట్‌సీల్, బాల్డ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ ల మధ్య కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.
From the sets of #SSMB29 🔥@urstrulyMahesh @ssrajamouli pic.twitter.com/OYIqOhuDH4
— TWTM™ (@TWTM__) March 18, 2025
SSMB29 టీమ్ థాంక్స్ నోట్
ఈ నేపథ్యంలో ఒడిశాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం ఆ ప్రాంతంలోని ప్రకృతి అందాలు తమని ఎంతగానో ఆకట్టుకున్నాయంటూ తమ అనుభవాన్ని పంచుకుంది. ఇదొక స్వర్గసీమ అని ఆ ప్రాంత అందాన్ని వర్ణించింది. ఇక తమ షూటింగ్ సజావుగా సాగేందుకు సహకరించిన జిల్లా యంత్రాంగానికి, స్థానిక ప్రజలకు చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులకు మేకర్స్ థాంక్స్ నోట్ అందించారు. ఈ క్రమంలో చిత్రబృందంతో వారు ఫొటోలు దిగారు.
SS Rajamouli Says “From The Sets of #SSMB29“
Doubts Em Vaddu
Idi Na Dream Hero @urstrulyMahesh cinema ani chepthunnadu pic.twitter.com/Sn1bfR1Y1G— Hemanth Kiara (@urshemanthrko2) March 18, 2025
హైదరాబాద్‌కు SSMB29 టీమ్
మంగళవారం రాత్రి షూటింగ్ ముగియడం వల్ల సెట్స్‌కు అభిమానులు, స్థానికులు, అధికారులు భారీగా తరలివచ్చారు. నటీనటులను చూసేందుకు వచ్చిన వారు వారితో కాసేపు ముచ్చటించారు. హీరో మహేశ్ బాబు, హీరోయిన్ ప్రియాంకా చోప్రా, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో వారంతా ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మంగళవారం రాత్రే మూవీయూనిట్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కాగా.. నటీనటులు, రాజమౌళి మాత్రం బుధవారం ఉదయం బయల్దేరారు.






