కేరళ ఆలయంలో పేలుడు.. తొక్కిసలాటతో 150 మందికి గాయాలు

Mana Enadu : కేరళ కాసర్‌గోడ్‌ జిల్లా నీలేశ్వరం సమీపంలోని అంజోతంబలం వీరర్కవు ఆలయం(Kerala Temple)లో గత రెండు రోజులుగా వార్షిక కాళియాట్లం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన తెయ్యం ఉత్సవంలో భక్తులంతా మునిగిపోయారు. కొందరేమో కళాకారుల ప్రదర్శనలను ఉత్సాహంగా తిలకిస్తూ ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్లలో రికార్డు చేస్తున్నారు.

అకస్మాత్తుగా పేలుడు

ఈ క్రమంలో అకస్మాత్తుగా పేలుడు (Kerala Temple Blast) శబ్ధం వినిపించించడంతో అక్కడి భక్తులంతా ఉలిక్కిపడ్డారు. పేలుడు శబ్ధాలకు భయపడి పరుగులు పెట్టడంతో ఆ ప్రాంతంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 150 మందికిపైగా గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కాసరగోడ్‌, కన్నూర్‌, మంగళూరులోని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

బాణాసంచా పేలడం వల్లే మంటలు

అయితే తెయ్యం ఉత్సవంలో భాగంగా బాణసంచా కాల్చడం(Kerala Temple Fire Update)తో నిప్పు రవ్వలు ఎగిసి ఆలయం సమీపంలోని బాణసంచా నిల్వ ఉంచిన షెడ్డుపై పడ్డాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి బాంబు పేలినట్లుగా పెద్ద శబ్ధాలతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ భయానక దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిబంధనల ఉల్లంఘనల వల్లే

భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఇంబా శేఖర్ వెల్లడించారు. బాణసంచా (Kerala Fireworks Blast) నిల్వ ఉన్న ప్రాంతానికి కనీసం 100 మీటర్ల దూరంలో క్రాకర్లు కాల్చాలనే నిబంధనలు పాటించలేదని తెలిపారు. టపాసుల నిల్వకు సైతం అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఘటనా స్థలంలో నమూనాలు సేకరించి కేసు నమోదు చేశామని, ఆలయ అధ్యక్ష, కార్యదర్శిని అదుపులోని తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *