
ఒకప్పటి టాలీవుడ్(Tollywood) స్టార్ హీరోయిన్ ఇలియానా(Ileana D’Cruz) గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఆమె రెండోసారి తల్లి అయ్యారు. ఈసారి కూడా ఆమె పండంటి మగబిడ్డ(Baby Boy)కు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా వెల్లడించారు. తన కుటుంబంలోకి వచ్చిన కొత్త సభ్యుడిని పరిచయం చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్(Post) ప్రస్తుతం సోషల్ మీడియా(SM)లో వైరల్ అవుతోంది.
View this post on Instagram
మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి
ఇలియానా దంపతులకు ఈ నెల 19న మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటిస్తూ తమ కుమారుడికి ‘కియాను రాఫె డోలన్(Keanu Rafe Dolan)’ అని పేరు పెట్టినట్లు కూడా తెలిపారు. చిన్నారి ఫొటోను పంచుకుంటూ “మా కుటుంబంలోకి మా రెండో అబ్బాయి కియాను రాఫె డోలన్‌కు స్వాగతం. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వార్త తెలియగానే అభిమానులు(Fans), సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు(Wishes) తెలుపుతున్నారు.
ఇలియానా పోర్చుగీసుకు చెందిన తన ప్రియుడు మైఖేల్ డోలన్(Michael Dolan)ను 2023 మేలో వివాహం(Marriage) చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు 2023 ఆగస్టులో మొదటి కుమారుడు ‘కోవా ఫీనిక్స్ డోలన్(Koa Phoenix Dolan)’ జన్మించాడు. ఇప్పుడు దాదాపు రెండేళ్ల తర్వాత వారి కుటుంబంలోకి మరో చిన్నారి అడుగుపెట్టాడు.