
లండన్‌లోని లార్డ్స్(Lord’s) క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్(England vs India, 3rd Test ) రసవత్తరంగా సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న రెండు జట్లు, ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. ఇంగ్లండ్(England) టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది, మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది. జో రూట్ (104) శతకం చేయగా, జామీ స్మిత్, బ్రైడన్ కార్స్ అర్ధసెంచరీలతో రాణించారు. భారత బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprith Bumrah) అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. అతని 15వ ఫైవ్-వికెట్ హాల్ కావడం విశేషం.
🔥 HISTORY CREATED BY JASPRIT BUMRAH 🔥
Bumrah now holds the record for the most five-wicket hauls in away Tests by an Indian in Test cricket history!He achieves this milestone in the 3rd Test against England at Lord’s.#ENGvsIND#ENGvINDpic.twitter.com/Dybcxc6rbJ
— Punny (@PunnyBhaiya) July 11, 2025
నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లోకి ఆర్చర్
అనంతరం భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 145/3 స్కోరు చేసింది, ఇంగ్లండ్ కంటే 242 పరుగులు వెనుకబడి ఉంది. యశస్వీ జైస్వాల్ (13), కరుణ్ నాయర్ (40), శుభ్‌మన్ గిల్‌లు ఔట్ కాగా, కేఎల్ రాహుల్ (53*), రిషభ్ పంత్(19*) అజేయంగా నిలిచారు. జోఫ్రా ఆర్చర్(Jofra Archar), నాలుగు సంవత్సరాల తర్వాత టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చి, జైస్వాల్ వికెట్ తీసి ఆకట్టుకున్నాడు. లార్డ్స్ పిచ్ మొదటి రోజు బౌలర్లకు సహకరించినప్పటికీ, రెండో రోజు బ్యాటింగ్‌కు కొంత అనుకూలంగా మారింది.
రాహుల్-పంత్ జోడీ నిలిస్తేనే..
ఇక మూడో రోజు రాహుల్-పంత్(KL Rahul-Rishabh Pant) జోడీ పటిష్ఠంగా నిలిచి భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇంగ్లండ్ బౌలర్లు, ముఖ్యంగా ఆర్చర్, వోక్స్, బౌలింగ్‌లో వేగం, కచ్చితత్వంతో భారత్‌పై ఒత్తిడి తెస్తున్నారు. స్టువర్ట్ బ్రాడ్ హెచ్చరించినట్లు, బుమ్రా తిరిగి రావడంతో భారత బౌలింగ్ యూనిట్ బలంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ ఫలితం సిరీస్ దిశను నిర్ణయించే అవకాశం ఉంది.