ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steven Smith) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు(Retirement) పలుకుతున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు గాయం కారణంగా తప్పుకోవడంతో ఆయనకు క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే తాజాగా సెమీస్‌లో భారత్‌పై ఓటమి నేపథ్యంలోనే స్మిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే టెస్టులు, T20 ఫార్మాట్లో ఆస్ట్రేలియాకు సేవలు అందిస్తానని స్పష్టం చేశాడు.
భారత్‌పై అద్భుత రికార్డు
కాగా 2010లో వెస్టిండీస్(West Indies)పై స్పిన్ ఆల్ రౌండర్‌గా జట్టులోకి వచ్చిన స్మిత్..ఇప్పటి వరకూ 170 మ్యాచుల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. రెండు సార్లు ఆ జట్టుకు వన్డే ప్రపంచకప్‌లు అందించాడు. ఈ ఫార్మాట్లో అతడు 43.28 యావరేజ్‌తో 5,800 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు (164) న్యూజిలాండ్‌పై సాధించాడు. కాగా భారత్(India)పై స్మిత్‌కు మంచి రికార్డు ఉంది. టీమ్ఇండియాపై వన్డేల్లో 5 సెంచరీలు, 7 అర్ధశతకాలతో మొత్తం 1383 రన్స్ చేశాడు. కాగా స్మిత్ సడెన్ రిటర్మైంట్ న్యూస్ ఆసీస్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేసింది.
Steve Smith ended his ODI careers🥺#SteveSmith #Cricket #ChampionsTrophy #Australia #INDvAUS pic.twitter.com/yGJbjbpAmC
— Journalist Shailesh Dixit (@shaileshdixit61) March 5, 2025






