Stock Market Crash: hMPV వైరస్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లు క్రాష్!

చైనాలో వెలుగు చూసిన కొత్త వైరస్ hMPV ప్రభావం స్టాక్ మార్కెట్ల(Stock Markets)పై పడింది. దీంతో ఇవాళ ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.12 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు(Investers) కోల్పోయారు. ఇటు ఇండియన్ సూచీలు సైతం భారీ పతనం నమోదు చేశాయి. Sensex, Niftyలు 1.75 శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 78,000 దిగువకు పడిపోయింది. Nifty 23,600 స్థాయి దిగువకు చేరుకుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు 200 DMA దిగువకు పడిపోయాయి. దీని వెనుక ప్రధాన కారణం చైనీస్ వైరస్(Chaina Virus) అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా భారత్‌(India)లోనూ 6కేసులు నమోదవడంతో పెట్టుబడిదారులలో భయాందోళనలు పెరిగి.. షేర్ల అమ్మకాలకు దిగారు. దీంతో సూచీలు కుప్పకూలాయి.

కొవిడ్ నాటి పరిస్థితులను గుర్తుచేశాయి: అనిల్ సింఘ్వీ

మరోవైపు స్టాక్ మార్కెట్లు కొవిడ్(Covid-19) కాలాన్ని ప్రజలకు గుర్తు చేశాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అనిల్ సింఘ్వీ(Anil Singhvi) తెలిపారు. ఈ పరిస్థితి కోవిడ్ అంత తీవ్రంగా లేనప్పటికీ, భయం కారణంగా మార్కెట్‌లో అమ్మకాల వాతావరణం(Sales environment in the market) ఏర్పడిందన్నారు. ఇది కాకుండా విదేశీ ఇన్వెస్టర్లు (FIIలు) విక్రయించడం మార్కెట్‌పై మరింత ఒత్తిడి పెంచిందని తెలిపారు. BSEలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ (Mcap) రూ.12,38,638 కోట్లు తగ్గి రూ.4,38,95,210 లక్షల కోట్లకు చేరింది.

ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి రూపీ విలువ

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌(Kotak Mahindra Bank), ఏషియన్‌ పెయింట్స్‌ తదితర షేర్లు కూడా క్షీణించాయి. టాటా స్టీల్(TATA Steel), రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్, కోటక్ బ్యాంక్, TATA మోటార్స్, ITC వంటి హెవీవెయిట్ స్టాక్‌లలో అమ్మకాలు మార్కెట్‌ను దిగువకు లాగాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాలర్‌(Dollor)తో రూపాయి మారకం విలువ పోల్చుకుంటే ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. సోమవారం (JAN 6) అమెరికా కరెన్సీతో రూపాయి మారకం విలువ రూ.85.82కి పడిపోయింది. ఇది ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *