Stunt Master SM Raju: తమిళ ఇండస్ట్రీలో విషాదం.. షూటింగ్ స్పాట్‌లోనే స్టంట్ మాస్టర్ మృతి

తమిళ చలనచిత్ర పరిశ్రమ(Tamil Cine Industry)లో విషాదం నెలకొంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ SM రాజు (Stunt Master SM Raju,52) నాగపట్టినం జిల్లాలోని విళుందమవాడిలో జరిగిన ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు మృతి (Accidental death) చెందారు. పా. రంజిత్(Pa. Ranjith) దర్శకత్వంలో ఆర్య(Arya) హీరోగా నటిస్తున్న ‘వేట్టువం(Vettuvam)’ చిత్ర షూటింగ్‌లో రాజు కారు పల్టీ స్టంట్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. రాజు గతంలో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో అత్యంత ప్రమాదకర స్టంట్లు చేసిన నైపుణ్యం, ధైర్యం కలిగిన వ్యక్తిగా పేరు పొందారు.

నటుడు విశాల్ దిగ్భ్రాంతి

ఈ సందర్భంగా తమిళ నటుడు విశాల్(Actor Vishal) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాజుతో అనేక చిత్రాల్లో కలిసి పనిచేసిన వ్యక్తిగా, Xలో భావోద్వేగంతో ట్వీట్ చేశారు. “రాజు ధైర్యసాహసాలు మరువలేనివి. అతని కుటుంబానికి నా సంతాపం, వారి భవిష్యత్తుకు అండగా ఉంటాను” అని విశాల్ పేర్కొన్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా(Stunt choreographer Silva) కూడా రాజును స్మరిస్తూ, “మా స్టంట్ యూనియన్, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటు” అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

కాగా తాజా ఘటన సినిమా షూటింగ్‌లలో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చకు దారితీసింది. మరోవైపు ఈ దుర్ఘటనపై ఆర్య, పా. రంజిత్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *