భారీ ధరకు ‘మా నాన్న సూపర్ హీరో’ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mana Enadu : నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)’. అభిలాష్‌ రెడ్డి కంకర తెరకెక్కించిన ఈ సినిమాను సునీల్‌ బలుసు నిర్మించారు. ఆర్ణ కథానాయికగా నటించారు. సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈనెల 11వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హీరో మహేశ్‌బాబు శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

‘‘ఒకప్పుడు ఈ డబ్బు అవసరమే నా కొడుకును నాకు దూరం చేసింది. దాని విలువ పాతిక సంవత్సరాలు’’ అంటూ సాయిచంద్‌ చెప్పే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్‌ చూస్తుంటే ఇది తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతోంది. ‘‘కళ్లజోడు పెట్టుకుంటే ప్రపంచం మారిపోదు. ప్రేమతో చేసినంత మాత్రాన తప్పు తప్పు కాకుండా పోదు’’, ‘‘కంటే తండ్రైపోవు. తనతో ఉండాలి. సరిగా పెంచాలి’’, ‘‘నా కోసం చేస్తే తప్పు. కానీ, ఇది నాన్న కోసం. తప్పదు’’  అంటూ ట్రైలర్‌లో సుధీర్‌బాబు చెప్పిన డైలాగ్స్‌ (Maa Nanna Super Hero Trailer) హార్ట్ టచింగ్ గా ఉన్నాయి.

ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ (Maa Nanna Super Hero OTT rights) కూడా భారీగానే దక్కించుకున్నట్లు తెలిసింది. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్ర డిజిటల్ రైట్స్ జీ5 (Zee5) ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్లు కనిపిస్తోంది. దాదాపు రు.20 కోట్లకు పైగానే చెల్లించి ఈ మూవీ ఓటీటీ హక్కులు చేజిక్కించుకున్నట్లు సినిమా వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. అంటే సినిమా రిలీజ్ తర్వాత దాదాపు 50 రోజులు అంటే డిసెంబరు మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *