కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు హీరో సుధీర్ బాబు (Sudheer Babu). ఈసారి ఎలాగైన భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఆయన తాజాగా నటించిన మూవీ‘జటాధర’ (Jatadhara). బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్ (Sonakshi Sinha). ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో వెంకట్ కల్యాణ్ రూపొందిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ టీజర్ ను రిలీజ్ చేయడం విశేషం (Jatadhara Teaser). విజువల్ ఎఫెక్ట్స్ కు పెద్దపీఠ వేస్తూ మూవీని తీస్తున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. సోనాక్షి సిన్హా పవర్ ఫుల్ లుక్ లో కనిపించింది. ‘దురాశకు, త్యాగానికి మధ్య జరిగే పోరాటాన్ని చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి’ అని మూవీ టీమ్ పేర్కొంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.
Top-notch quality visuals that scream perfection 📸 💥🔥
Esari hit kotadathunavu#JatadharaTeaser 🔱🔔🕉️📿#sudheerbabu #Jatadhara #maheshbabu pic.twitter.com/ava25YbZfr— Sai Naidu (@heysai0) August 8, 2025






