భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇప్పటికే మొదటి టెస్టు ముగియగా.. డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు జరగనుంది. ఈ పింక్ బాల్ టెస్టు కోసం టీమ్ ప్లేయింగ్ ఎలెవన్‌పై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) జోస్యం చెప్పాడు. మొదటి టెస్టులో అందుబాటులో లేని రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వస్తారని.. వారి రాకతో దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి బయటకివస్తారని గవాస్కర్ తెలిపాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ కూడా మార్పులు జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.
గవాస్కర్ మాట్లాడుతూ..‘‘జట్టులో కచ్చితంగా కొన్ని మార్పులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. రోహిత్ శర్మ, (Rohit Sharma) శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తిరిగి జట్టులోకి వస్తారు. ఈసారి బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పులు జరిగే చాన్స్ ఉంది. కేఎల్ రాహుల్ స్థానంలో రోహిత్, మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్ వస్తారు. పడిక్కల్, జురెల్ తుది జట్టులో ఉండరు. రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. మూడో మార్పు ఏంటంటే వాషింగ్టన్ సుందర్ ప్లేస్‌లో రవీంద్ర జడేజా తుది జట్టులోకి వస్తాడు’’ అని గవాస్కర్ జోస్యం చెప్పారు.
సునీల్ గవాస్కర్ అంచనా వేసిన జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో (Border Gavaskar Trophy 2024–25) భాగంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో అన్ని విభాగాల్లోనూ ఆసీస్‌పై ఆధిపత్యం చలాయించిన టీమిండియా 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్టుకు రోహిత్ శర్మ, గిల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడంతో జట్టు మరింత బలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌ను సైతం చేజిక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది.








