ఫిబ్రవరి కాదు మార్చి.. సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం

Mana Enadu : ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా జూన్‌ 6వ తేదీన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ (boeing starliner) క్యాప్సుల్‌లో వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), విల్‌మోర్‌  రోదసిలోకి వెళ్లిన విషయం తెలిసిందే.  వాస్తవానికి జూన్ 14వ తేదీనే వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉండగా..  వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురై.. వారు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఈ క్రమంలోనే ఆమె రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నట్లు నాసా (NASA) తాజాగా వెల్లడించింది.

ఫిబ్రవరి కాదు మార్చి

అయితే వీరిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు హాగ్‌, గోర్బునోవ్‌ వ్యోమగాములతో స్పేస్ఎక్స్ క్రూ-9 (spacex Crew-9 mission) అనే మిషన్‌ను ప్రయోగించి స్పేస్ లో చిక్కుకున్నవారిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు రెండు సీట్లు ఖాళీగా పంపించారు. సెప్టెంబరులోనే స్పేస్ కు చేరుకున్న ఈ వ్యోమనౌకలో నలుగురు ఫిబ్రవరిలో తిరిగి వస్తారని తొలుత నాసా (NASA On Sunita Williams Return) ప్రకటించింది. అయితే క్రూ-9 సిబ్బందిని రిలీవ్‌ చేసేందుకు వెళ్లే క్రూ-10 ప్రయోగం మార్చి కంటే ముందు జరిగే సూచనలు కనిపించడం లేదని తాజాగా నాసా ప్రకటించింది. దీంతో సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ ఆలోగా భూమి పైకి తిరిగొచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ముచ్చటగా మూడోసారి

ఇక భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ (Sunita Williams Arrival News) ముచ్చటగా మూడోసారి అంతరిక్షానికి వెళ్లారు. 2006, 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన ఆమె.. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ నిర్వహించారు. మొత్తం ఆమె 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఇక ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డ్యాన్స్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *