IPL 2025లో భాగంగా ఈ రోజు మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో లక్నో సూపర్ జెయింట్స్(LSG) తలపడుతోంది. లక్నో(Lucknow)లోని ఏకనా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో హైదరాబాద్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే లక్నో ప్లేఆఫ్(Playoffs) ఆశలు సజీవంగా ఉంటాయి, ఒకవేళ ఓడితే వారి సీజన్ అధికారికంగా ముగిసినట్లే. మరోవైపు, ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ ఒత్తిడి లేకుండా ఆడేందుకు సిద్ధంగా ఉంది, ఇది లక్నోకు సవాల్‌గా మారనుంది.
Toss time presentation Murli Kartik #SRHvsLSG #srhvlsg#LSGvSRH #LSGvsSRH#IPL2025pic.twitter.com/1zFNgH5QdI
— RO_KO fanclub🏏 (@MohammadFa83199) May 19, 2025
మూడు మ్యాచులు తప్పక నెగ్గాల్సిందే..
కాగా ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ 11 మ్యాచ్‌లలో 5 విజయాలు, 6 ఓటములతో 10 పాయింట్లతో పాయింట్ల టేబుల్లో 7వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరాలంటే, మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పనిసరిగా విజయాలు సాధించాలి. ఈ మ్యాచులో లక్నో తరఫున విల్ ఒరూర్కీ డెబ్యూ చేస్తున్నాడు. అటు SRH రెండు మార్పులు చేసింది. హర్ష్ దూబే, తైడే జట్టులోకి రాగా, ఆసీస్ ప్లేయర్ హెడ్ కరోనా కారణంగా దూరమయ్యాడు.
తుది జట్లు ఇవే..
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (Wk), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (C), హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ
లక్నో సూపర్ జెయింట్స్ : ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (C/Wk), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, విల్ ఒరూర్కీ






