ఐపీఎల్ 2025లో ‘చేతులుకాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా మారింది సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) పరిస్థితి. ప్లేఆఫ్స్ రేసుకు ముందు వరుస పరాజయాలు చవిచూసి టాప్-4లో ప్లేస్ దక్కించుకోలేకపోయిన కమిన్స్ సేన ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన తర్వాత భారీ విజయాలు సాధిస్తోంది. మొన్న గ్రాండ్ విక్టరీ కొట్టి లక్నోను ఇంటికి పంపిన ఆరెంజ్ ఆర్మీ.. శుక్రవారం రాత్రి లక్నోలో జరిగిన మ్యాచులోనూ నెగ్గి బెంగళూరును టాప్ ప్లేస్‌కి వెళ్లనీయకుండా చేసింది. ఇక ఈ సీజన్లో తన చివరి మ్యాచ్ రేపు (మే 25)న KKRతో తలపడనుంది. ఆ మ్యాచులోనూ నెగ్గి ఈ సీజన్‌ను గౌరవప్రదంగా ముగించాలని కమిన్స్ సేన భావిస్తోంది.
ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్
ఇక RCBతో లక్నో వేదికగా జరిగిన మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన SRH నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231/6 భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ 34, హెడ్ 17 రన్స్ చేయగా.. ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 94 రన్స్) మెరుపులు మెరిపించాడు. క్లాసెన్ 24, అనికేత్ 26, చివర్లో అభినవ్ 12, కమిన్స్ 13 రన్స్ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో షెఫర్డ్ 2, భువనేశ్వర్, ఎంగిడి, సుయాశ్, కృనాల్ తలో వికెట్ తీశారు.
ఛేజింగ్‌లో సాల్ట్, కోహ్లీ ఇద్దరే
అనంతరం 232 పరుగుల భారీ టార్గెట్ ఛేదనలో RCB 189కే కుప్పకూలింది. ఓపెనర్లు సాల్ట్ 62, కోహ్లీ 43 తొలి వికెట్‌కు 80 రన్స్ జోడించి విజయానికి బాటలు వేసినా ఆ తర్వాత బ్యాటర్లు అదే ఊపును కొనసాగించలేకపోయారు. ఈ క్రమంలో మయాంక్ 11, పాటీదార్ 18, జితేశ్ 24 మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, మలింగ 2, జయదేవ్, హర్షల్, హర్ష్ దూబే, నితీశ్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో ఆర్సీబీ 3వ ప్లేస్‌కి పడిపోయింది. టాప్-2లో GT, PBKS ఉన్నాయి.
🧡 Orange Storm hits Bengaluru!
SRH crush RCB by 42 runs with a top-notch all-round display — power-packed batting and ruthless bowling!🔥🏏#RCBvSRH pic.twitter.com/x2GZTIziPk— Naseem Akhtar (@iamnaseem_1) May 23, 2025






