Mahesh Babu: ఖలేజా రీరిలీజ్.. థియేటర్లలో ఫ్యాన్స్ సందడి

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) డైరెక్షన్‌లో 2010, అక్టోబర్ 7న మూవీ ఖలేజా(Khaleja). ఈ మూవీ 15 ఏళ్ల కిందట రిలీజైనా.. బాక్సాఫీస్(Box Office) దగ్గర డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ మూవీ అప్పట్లో థియేటర్లో ప్లాఫ్ అయినా టీవీలో మాత్రం దుమ్మురేపి ఓ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ట్రెడిషనల్ హీరోయిజాన్ని ఓ ఫిలాసఫికల్ కోణంతో మిళితం చేసి సామాన్య ట్యాక్సీ డ్రైవర్ ఓ కుగ్రామానికి దేవుడిలా ఎలా మారాడు అనే కాన్సెప్ట్‌ని తనదైన శైలిలో చూపించాడు త్రివిక్రమ్. గత మూవీలకు భిన్నంగా మహేశ్‌బాబు కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్‌తో దుమ్మురేపాడు. అనుష్క(Anushka Shetty) యాక్టింగ్, సునీల్(Sunil) కామెడీ టైమింగ్‌ అదుర్స్ అనిపిస్తుంది. తాజాగా మూవీని ఇవాళ (మే 30) రీరిలీజ్ మేకర్స్ చేశారు.

థియేటర్లకు పోటెత్తారు..

దీంతో ప్రిన్స్ అభిమానులు(Fans) థియేటర్లకు పోటెత్తారు. ఈ క్రమంలో థియేటర్లలో సినిమాలోని సీన్లను రీక్రియేట్(Recreate scenes) చేస్తున్నారు. ఖలేజా సినిమాలో మహేశ్ గెటప్‌లు వేస్తూ కొందరు.. అటు మూవీలో ఫస్ట్ ఫైటింగ్‌లో వచ్చే పాము సీన్‌ను గుర్తుచేస్తూ విజయవాడలో ఓ ఫ్యాన్ థియేటర్‌లోకి ఏకంగా పామునే తీసుకొచ్చాడు. దీంతో మిగతా వారంతా బెదిరిపోయారు. ఈ మూవీ ఆడుతున్న థియేటర్ల వద్ద భారీ కటౌట్లు కట్టారు. మహేశ్ ఫొటోలకు పాలాభిషేకాలు చేశారు. అంతేకాదు అందులోని పాటలకు థియేటర్లో స్ర్కీన్ ముందు డ్యాన్సులు చేసే హంగామా చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీ రీరిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాసింది. అడ్వాన్స్ బుకింగ్స్‌(Advance Bookings)లో 5 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో ఈ సినిమా మహేశ్ బాబు కెరీర్‌లో థియేటర్లలో విడుదలకు ముందే 5 కోట్లు వసూలు చేసిన 4వ రీరిలీజ్ సినిమాగా నిలిచింది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *