సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ(Coolie)’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నిన్న (ఆగస్టు 14) విడుదలై బాక్సాఫీస్(Box Office) వద్ద సంచలనం సృష్టించింది. లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజు రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి కోలీవుడ్(Kollywood) చరిత్రలో రెండో అత్యధిక ఓపెనింగ్ రికార్డు నమోదు చేసింది. విజయ్ నటించిన ‘లియో(Leo)’ (రూ.145 కోట్లు) కంటే కొంచెం వెనుకబడినప్పటికీ, ఈ చిత్రం భారీ అంచనాలను అందుకుంది.
ఇండియాలో రూ.65 కోట్ల నెట్ కలెక్షన్స్
ఇక ఇండియా(India)లో ‘కూలీ’ రూ.65 కోట్ల నెట్ కలెక్షన్స్(Net Collections) రాబట్టగా, తమిళనాడులో రూ.30 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.18 కోట్లు, కర్ణాటకలో రూ.15 కోట్లు, కేరళలో రూ.10 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో రూ.75 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది, ముఖ్యంగా అమెరికా(USA)లో 3 మిలియన్ డాలర్ల (25 కోట్లు) పైగా వసూళ్లు రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రూ. 100 కోట్లు దాటిన ఈ చిత్రం, 12,000 స్క్రీన్లలో విడుదలై 84% ఆక్యుపెన్సీ సాధించింది.
Opening Day collections
Leo(2023)India ₹79 Crores
Overseas ₹66 crores
Total Gross ₹145 Crores
Coolie (2025)
India ₹65 Crores
Oversea ₹75 Cr
Total ₹140 CroresSource ( Scan Disk)
Leo remains Top Most Opening in Total first Day
Box Office Collections pic.twitter.com/gs9YRfOOXT— BUSHINDIA (@BUSHINDIA) August 15, 2025
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సత్యరాజ్(Satyaraj) వంటి తారాగణం, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, మిక్స్డ్ టాక్‌తో సెకండాఫ్ కొంత నీరసంగా అనిపించినప్పటికీ, హాలిడే సీజన్, రజినీ స్టార్డమ్ కారణంగా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం రూ. 600 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.






