తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కూలీ(Coolie)’. తాజాగా ఈ మూవీ సెన్సార్(Censor) ప్రక్రియను పూర్తి చేసుకుంది. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి A-సర్టిఫికెట్ జారీ చేసింది, అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే పరిమితం. ఇక ఈ చిత్రం రన్ టైం(Coolie Movie Run Time) 170 నిమిషాలుగా ఉంది, అంటే 2 గంటల 50 నిమిషాలు ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
#Coolie – A certificate
Run Time : 2 hours 50 minutes#CoolieThePowerHouse #CoolieFromAug14 pic.twitter.com/tOIow5PWG6— AR Entertainment (@ARMedia28524249) August 7, 2025
నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో నాగార్జున
‘కూలీ’ చిత్రం గోల్డ్ స్మగ్లింగ్(Gold Smuggling) నేపథ్యంలో రూపొందింది. ఇందులో రజినీకాంత్ ‘దేవా(Deva)’ అనే పాత్రలో కనిపించనున్నారు. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సైమన్ అనే నెగటివ్ షేడ్స్ ఉన్న గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, పూజా హెగ్డే అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో
సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్(Teaser), ట్రైలర్(Trailer), ఆడియో లాంచ్‌లతో ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెజాన్ డెలివరీ బాక్స్‌లపై సినిమా పోస్టర్లతో వినూత్న ప్రచారం కూడా జరిగింది. ఈ చిత్రం లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమని, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు రజినీకాంత్ మార్క్ మాస్ ఎలివేషన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం. సెన్సార్ ‘ఏ’ సర్టిఫికెట్ కారణంగా వైలెన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండవచ్చని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ రన్ టైంతో ‘కూలీ’ ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుందా లేక అంచనాలను అందుకోలేదనే చర్చలు మొదలవుతాయా అనేది ఆగస్టు 14న విడుదలైన తర్వాతే తేలనుంది.






