
రోటి కపడా రొమాన్స్ మూవీతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సుప్రజ్ (Supraj) హీరోగా, జనక అయితే గనక సినిమాతో ఆకట్టుకున్న సంగీర్తన విపిన్ (Sangeerthana Vipin) కలిసి నటిస్తున్న కొత్త చిత్రం పనులు ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. చందురామ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు పయనం (Payanam) అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ క్లాప్ కొట్టగా, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె కెమెరా స్వీచ్ఛాన్ చేశారు.
కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నాం..
ఈ సందర్భంగా దర్శకుడు చందూరామ్ మాట్లాడుతూ పయనం కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న చిత్రమన్నారు. డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చేసే అంశాలు చాలా ఉంటాయని తెలిపారు. అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. నిర్మాత స్వర్ణ కమల మాట్లాడుతూ.. ఈతరం ప్రేక్షకులు మెచ్చే అంశాలతో రూపొందుతున్న ఓ వైవిధ్యమైన చిత్రమిది అని తెలిపారు. మంచిర్యాల, తమిళనాడు, ఒడిశా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తిచేస్తామన్నారు.
The launch of a brand-new Telugu film titled #Payanam took place in Hyderabad!
Cast: #Supraj, #SangeerthanaVipin
Film Directed by #ChanduramThe Shooting will take place in locations around Mancherial, Tamil Nadu, & Odisha. Regular shooting is set to commence from July 7. pic.twitter.com/lX381g64pQ
— MOHIT_R.C (@Mohit_RC_91) June 8, 2025