మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) నేడు (బుధవారం) విచారణ జరగనుంది. ఫార్ములా-ఈ కారు రేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ నెల 8వ తేదీన ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది.
ఫార్ములా ఈ రేసు (Hyderabad Formula E Race Case) కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం కేటీఆర్ (KTR ACB Case) పిటిషన్‌పై ఇవాళ విచారణ జరపనుంది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.







