Suriya’s Retro: సూర్య ‘రెట్రో’ మూవీ రిలీజ్ డేట్ లాక్

స్టార్ హీరో సూర్య(Suriya), కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘రెట్రో(Retro)’. ఈ మూవీలో సూర్యకు జోడీగా పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తోంది. సంతోష్ నారాయణన్(Santosh Narayanan) చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించి టైటిల్ టీజర్‌(Title teaser)ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. సూర్యను రెట్రో స్టైల్‌లో చూసిన అభిమానులు(Fans) పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాతో సూర్య హిట్ కొట్టడం ఖాయం అంటూ సంబరపడిపోయారు సూర్య ఫ్యాన్స్. సినిమాలో సూర్య డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్‌(Action entertainer)గా ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈమూవీ రిలీజ్ తేదీపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

పాన్‌ ఇండియా రేంజ్‌లో..

కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1వ తేదీన సూర్య రెట్రో మూవీ(Retro movie)ని విడుదల చేయనున్నట్లు మేకర్స్(Makers) అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా ‘రెట్రో’ అనే పదానికి అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితం. కార్తీక్‌ సుబ్బరాజ్ సినిమాలంటే కేవలం తమిళ్‌ ప్రేక్షకులు(Tamil Fans) మాత్రమే కాకుండా ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి చూపించే వారు ఉన్నారు. కనుక పాన్‌ ఇండియా రేంజ్‌(Pan India Range)లో ఈ సినిమాను సరిగ్గా ప్రమోట్‌ చేస్తే కచ్చితంగా మంచి బిజినెస్ చేయడంతో పాటు, మంచి ఫలితాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని టీజర్ చూస్తే అనిపిస్తుంది.

డిజాస్టర్‌గా నిలిచిన కంగువ

కాగా సూర్య ఇటీవల నటించిన లేటెస్ట్ మూవీ కంగువ (Kanguva).ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. కంగువ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు దాటేసింది. దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కంగువ సినిమా సౌండింగ్(Sounding) విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. సౌండ్ ఎక్కువగా ఉండటంతో సినిమా గందరగోళంగా ఉంది అని చాలా మంది విమర్శించారు. OTTలోనూ ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *