తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) సారథి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకూ ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్(Etala Rajender), రఘునందన్‌రావు మధ్య గట్టి పోటీ ఉందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాజీ MLC రామచంద్రారావు పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయనతోపాటు MP డీకే అరుణ కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీరిలో ఇద్దరి పేర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు(Ramachandra Rao), మల్కాజిగిరి MP ఈటల రాజేందర్‌లలో ఒకరికి అవకాశం దక్కే వీలుందని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కాబోయే నూతన అధ్యక్షుడికి సోమవారం ఉదయం జాతీయ నాయకత్వం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందనున్నట్లు తెలిసింది.
నేడు నామినేషన్ల స్వీకరణ
కాగా రాష్ట్ర అధ్యక్ష పదవి(State President) కోసం నియమితులైన ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి(Election Returning Officer), కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్(Sunil Bansal) సోమవారం ఉదయం రానున్నారు. అధ్యక్ష ఎంపికలో కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బీజేపీ ఆఫీస్‌లో నామినేషన్లు(Nominations) స్వీకరిస్తారు. అయితే నామినేషన్లు ఎన్ని వచ్చినా ఆ ఇద్దరిలోనే ఒకరికి అధ్యక్ష పదవి దక్కనున్నట్లు సమాచారం. కాగా జులై 1న LB నగర్‌లోని ఒక ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర అధ్యక్షుడి పేరును బీజేపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Much-awaited notification for the #BJP #Telangana State President election is finally out! The race has triggered high-stakes lobbying among top contenders even as the central leadership pushes for a unanimous choice to avoid a messy showdown.
Key contenders in the fray:
•MP… pic.twitter.com/icwJL8XJpM— Ashish (@KP_Aashish) June 29, 2025






