Mana Enadu : ఆన్ లైన్ గ్రాసెరీ డెలివరీ యాప్స్ వచ్చినప్పటి నుంచి నగరాల్లో ఉంటున్న చాలా మంది సామగ్రి కొనడానికి మార్కెట్లకు వెళ్లడం మానేశారు. ప్రతిచిన్నదానికి కూడా ఈ యాప్స్ నే వినియోగిస్తున్నారు. ఇక ఆఫర్లు ప్రకటించడంతో వినియోగదారులు ఆన్ లైన్ డెలివరీ వైపు మక్కువ చూపుతున్నారు. అలా ఆన్లైన్ గ్రాసెరీ డెలివరీలో హైదరాబాద్ మహానగరంలో ‘స్విగ్గీ ఇన్ స్టామార్ట్ (Swiggy Insta Mart)’ హవా సృష్టించింది. ఫుడ్ డెలివరీ సంస్థగా ప్రారంభమైన ఈ సంస్థ నేడు పండ్లు, కూరగాయలతోపాటు గృహోపకరణాలను కూడా డెలివరీ చేస్తోంది.
2 లక్షల కండోమ్స్
ఈ క్రమంలో ఈ ఏడాది డెలివరీ చేసిన వస్తువుల వివరాలు వెల్లడిస్తూ స్విగ్గీ (Swiggy 2024 Report) ఓ ప్రకటన విడుదల చేసింది. కూరగాయలతో పాటు చిప్స్, కండోమ్‌లు, ఐస్‌క్రీమ్, మ్యాగీ, పాలు ఈ ఏడాదిలో ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. 2024లో దాదాపు 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లు, 19 లక్షలకు పైగా పాలు, బ్రెడ్, గుడ్ల కోసం రూ.1.54 కోట్ల విలువైన ఆర్డర్‌లను స్వీకరించినట్లు వెల్లడించింది. ఇక లోదుస్తుల కోసం 18,000, కండోమ్‌ల కోసం దాదాపు 2 లక్షల ఆర్డర్‌లను తీసుకున్నట్లు పేర్కొంది.
రూ.31 కోట్ల విలువైన ఐస్ క్రీమ్స్
ఈ ఏడాది హైదరాబాద్ వాసులకు నూడుల్స్‌పై మనసు లాగినట్టు స్విగ్గీ రిపోర్టు చూస్తే తెలుస్తోంది. ఏకంగా 25 లక్షల మ్యాగీ ప్యాకెట్లను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారట. సుమారు రెండు లక్షలకు పైగా కండోమ్‌ల (Condoms)పై ఆర్డర్లు వచ్చాయట.. అందులో 1300 మంది అజ్ఞాత పద్ధతి ఇన్‌కాగ్నిటో మోడ్ ద్వారా ఆర్డర్ చేసుకున్నట్లు స్విగ్గీ వెల్లడించింది. టూత్ బ్రష్‌ల కోసం రూ. 2.3 కోట్లకు పైగా.. ఐస్‌క్రీమ్‌లకు రూ.31 కోట్లు.. రూ.15 కోట్ల విలువ చేసే బ్యూటీ ప్రోడక్ట్‌లు కొనుగోలు చేసినట్లు కంపెనీ పేర్కొంది.
టాప్ 5 ఆర్డర్స్ అవే..
ఇక నగరంలో ఆర్డర్ చేసిన టాప్ 5 కూరగాయల్లో.. పాలు, టమోటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఉన్నాయి. ఇక ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కేవలం మామిడి పండ్ల కొనుగోలుకు రూ.35 వేల దాకా ఖర్చు చేశాడట. సుమారు రూ.1.55 కోట్ల విలువ చేసే పాలు, పాల పదార్థాలు, బ్రెడ్, కోడి గుడ్లను కొనుగోలు చేశారట. అందులో అత్యధికంగా 19 లక్షలకు పైగా పాల ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలిపింది.







