T20 – అగ్ర‌స్థానం నిల‌బెట్టుకున్న‌ సూర్య‌ , రెండో ర్యాంక్‌లో హార్దిక్ పాండ్యా

T20 – భార‌త స్టార్ క్రికెట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్(Suryakumar Yadav) టీ20ల్లో అగ్ర‌స్థానం నిలబెట్టుకున్నాడు. అఫ్గ‌నిస్థాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్(Rashid Khan) బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ 1గా నిలిచాడు. టీ20 ఆల్‌రౌండ‌ర్ల‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కిబుల్ హ‌స‌న్‌(Shakib Al Hasan) టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా పొట్టి.

భార‌త స్టార్ క్రికెట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్(Suryakumar Yadav) టీ20ల్లో అగ్ర‌స్థానం నిలబెట్టుకున్నాడు. అఫ్గ‌నిస్థాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్(Rashid Khan) బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ 1గా నిలిచాడు. టీ20 ఆల్‌రౌండ‌ర్ల‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కిబుల్ హ‌స‌న్‌(Shakib Al Hasan) టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో రెండో ర్యాంక్ సాధించాడు.

ఈరోజు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్ర‌క‌టించింది.  వెస్టిండీస్‌పై ఐదు టీ20ల సిరీస్‌లో దంచి కొట్టిన సూర్య 907 పాయింట్ల‌తో టాప్‌లో ఉన్నాడు. పాక్ ఓపెన‌ర్ మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్(Mohammad Rizwan) రెండో స్థానం ద‌క్కించుకున్నాడు. బాబ‌ర్ ఆజాం(Babar Azam) మూడు, ఎయిడెన్ మ‌ర‌క్రం(Aiden Markram) నాలుగు, రీలే ర‌స్సో(Rilee Rossouw) ఐదో స్థానంలో కొన‌సాగుతున్నారు.

భార‌త క్రికెట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) 17వ స్థానం, రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) 34వ ప్లేస్‌లో ఉన్నారు. విండీస్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన‌ తిల‌క్ వ‌ర్మ(Tilak Varma) 46వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక్క భార‌త క్రికెట‌ర్ కూడా టాప్ 10లో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు.

  • Related Posts

    BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

    పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

    PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

    క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *