Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే ఉక్రెయిన్‌ యుద్ధాని(Ukraine War)కి సంబంధించి ఎలాంటి ఒప్పందం(Agreement) కుదరకుండానే చర్చలు ముగిశాయి. భేటీ అనంతరం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఇరువురు నేతలు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. సమావేశం ఫలప్రదంగా సాగినట్లు పేర్కొన్నారు. చాలా అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్నివిషయాల్లో సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు.

Image

తుది ఒప్పందం మాత్రం కుదరలేదు: ట్రంప్

అయితే తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం తుది కాదన్నారు. త్వరలోనే తాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Ukrainian President Zelensky), యురోపియన్‌ యూనియన్‌ నేతలతో మాట్లాడతానని ట్రంప్‌ తెలిపారు. తాను మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పగా, తదుపరి సమావేశం మాస్కో(Masco)లో జరుగుతుందని పుతిన్‌ పేర్కొన్నారు.

సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగింది: పుతిన్

పుతిన్‌ మాట్లాడుతూ.. అలాస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయతీగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్‌తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్ట కాలంలో అధ్యక్షుడు ట్రంప్‌తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరుచుకుందని పుతిన్‌ వెల్లడించారు. గత పర్యాయం ట్రంప్‌ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేదని కాదని పుతిన్‌ మరోమారు పేర్కొన్నారు.

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

రష్యాలో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. ఫార్ ఈస్ట్‌లోని కమ్చట్కా ద్వీపకల్పం(Kamchatka Peninsula) సమీపంలో ఈరోజు ఉదయం (జులై 30) రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం పెట్రోపావ్‌లోవ్స్క్-కమ్చట్స్కీ(Petropavlovsk-Kamchatsky) నగరానికి 125 కిలోమీటర్ల దూరంలో 19.3 కిలోమీటర్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *