
చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మిల్కీబ్యూటీ తమన్నా (Tamannaah Bhatia). హ్యాపీడేస్ భారీ హిట్ తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు. సౌత్ లో టాప్ హీరోలందరితో కలిసి నటించింది. టాలీవుడ్‌లో చాలా కాలంపాటు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి..అడపాదడపా సినిమాలు చేస్తోంది. వెబ్ సిరీస్‌లతోనూ అలరిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ తన కెరీర్ బిగినింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని, ఓ సౌత్ బిగ్ హీరో తనపై అరిచారని పేర్కొన్నారు.
యూనిట్ ముందు పెద్దగా కేకలు వేశాడు
‘‘నేను టీనేజ్‌లోనే ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు నాకేం తెలియదనుకునేవారు. నా కాన్ఫిడెన్స్ ను దెబ్బతీయాలని చాలామంది ప్లాన్ చేశారు. అనేక అవమానాలు ఎదుర్కొన్నా. పరిశ్రమకు వచ్చిన కొద్దికాలంలోనే సౌత్ లో ఓ పెద్ద స్టార్ తో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆయనతో కొన్ని సీన్స్ చేస్తునప్పుడు అసౌకర్యంగా, కష్టంగా అనిపించింది. ఇబ్బందిగా ఉంది నేను చేయలేనని దర్శకనిర్మాతలకు చెప్పాను. అప్పుడా స్టార్ హీరో ‘హీరోయిన్‌ను మార్చేయండి’ అని నాపై గట్టిగా అరిచారు. ఆ అవమానాన్ని భరించాను. ఏదో పెద్దాయన కదా అని సైలెంట్‌గా ఉన్నా. ఆయన మాత్రం షూటింగ్ మధ్యలో యూనిట్ ముందు పెద్దగా కేకలు వేశాడు. మరుసటిరోజు ఆయనే నా వద్దకు వచ్చి సారీ చెప్పాడు. కోపం రావడంతో అరిచానని చెప్పాడు. నాతో అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపపడ్డారు’ అని తమన్నా పేర్కొన్నారు. అయితే ఆ బిగ్‌స్టార్ ఎవరనేది మాత్రం చెప్పలేదు.
2005లోనే ఎంట్రీ..
‘చాంద్ సా రోష్ చెహ్రా’ అనే హిందీ సినిమాతో 2005లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా (Tamannaah). మంచు మనోజ్ తో ‘శ్రీ’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి వచ్చింది. శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ సూపర్‌హిట్ కావడంతో అవకాశాలు వరుస కట్టాయి. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఎదిగింది. తెలుగులో ఆమె చివరి సినిమా ‘ఓదెల 2’. హిందీలో మాత్రం పలు సినిమాల్లో నటిస్తున్నారు.