హీరోయిన్లు అంత అందంగా ఎలా ఉంటారబ్బా.. అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. గ్లామర్ మెయింటైన్ చేసేందుకు ఎలాంటి టిప్స్ పాటిస్తుంటారు? ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. కాస్ట్లీ క్రీమ్స్ వాడతారేమో, లేదంటే విదేశాల్లో నుంచి తెప్పించుకుంటారేమోనని అనుకుంటారు. అలా చేసేవారు కొందరైతే.. మరికొందరు చాలా సింపుల్ టిప్స్ పాటిస్తూ తమ సౌందర్యాన్ని కాపాడుకుంటూ, మెరుగుపరుకుంటూ ఉంటారు. తన మొటిమలు తగ్గించుకునేందుకు మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) చెప్పిన చెప్పిన ఓ చిట్కా విని ఇంతేనా అని కొందరు భావిస్తుంటే.. ఇదేంటి తమన్నా ఇలా చేస్తుందా అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.
దీని వెనక సైన్స్ ఉందని నమ్ముతున్నా..
రీసెంట్ గా ఓ వెబ్ ఛానెల్ కు తమన్నా (Tamannaah Bhatia) ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను పాటించే హెల్త్, బ్యూటీ టిప్స్ను పంచుకున్నారు. ఈ సందర్భంలో యాంకర్ ‘మొటిమలు తగ్గించుకోవడానికి మీరేం చేస్తారు?’ అని అడిగాడు. దానికి తమన్నా సమాధానమిస్తూ.. ‘ఉదయం లేవగానే బ్రష్ చేయకముందే నా నోటిలో ఉండే లాలాజలాన్ని (ఉమ్మి) మొటిమలపై రాసుకుంటాను. అవి తగ్గిపోతాయి. ఇది నాకు వ్యక్తిగతంగా బాగానే వర్కౌట్ అయింది. దీని వెనక సైన్స్ ఉందని నమ్ముతున్నాను. ఉదయం నిద్రలేవగానే వచ్చే సలైవాలో యాంటి-బాక్టీరియా ఉంటుంది’ అని పేర్కొంది.
2021లోనే చెప్పిన మిల్కీ బ్యూటీ..
తమన్నా చెప్పిన చిట్కా విని పలువురు నెటిజన్ల మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే పింపుల్స్ తగ్గించుకునేందుకు రకరకాల క్రీములు ఉపయోగించాలని తెలుసు కానీ ఇలా ఉమ్మి రాసుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. తమన్నా ఈ టిప్ చెప్పడం ఇది కొత్తేం కాదు. 2021లోనే ఓసారి తన ముఖానికి సలైవా రాసుకుంటానని చెప్పింది. ఇప్పుడు మరోసారి తన బ్యూటీ సీక్రెట్ బయటపెట్టింది. అయితే ఈ చిట్కా అందరికీ వర్కౌట్ కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.






