Border Gavaskar Trophy: అశ్విన్​ ప్లేస్​లో ఆస్ట్రేలియాకు ఎవరు వెళ్తున్నారంటే?

అనూహ్యంగా రిటైర్​మెంట్‌ ప్రకటించిన స్పిన్​ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో మిగిలిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ (Border-Gavaskar Trophy) మ్యాచ్​ల కోసం బీసీసీఐ (BCCI) ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకుంది. ఇందుకోసం దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న ముంబై ఆల్‌రౌండర్‌ తనుష్‌ కోటియన్‌ను (Tanush Kotian) సెలక్టర్లు ఎంపిక చేశారు. మంగళవారం ఆస్ట్రేలియాకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉండాలని సెలక్టర్లు అతడికి చెప్పినట్లు సమాచారం.

26 ఏళ్ల కోటియన్‌ భారత్‌-ఎ జట్టు సభ్యుడిగా గత నెలే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఆ సిరీస్‌ ముగిసిన అనంతరం స్వదేశానికి వచ్చిన తనుష్​.. ప్రస్తుతం విజయ్‌ హజారే ట్రోఫీలో ముంబయి తరఫున ఆడుతున్నాడు. మంగళవారం ఆస్ట్రేలియా బయల్దేరనున్న కోటియన్‌.. మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే 4వ టెస్టుతో పాటు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరిగే ఐదో టెస్టుకు భారత జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.

ఆఫ్ స్పిన్నర్ అయిన 26 ఏళ్ల తనుష్ కోటియన్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్ (Ravichandran Ashwin) తరహాలో ఆఫ్ స్పిన్ వేయడంతో పాటు లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతోనే అతడికి బీసీసీఐ నుంచి పిలుపువచ్చినట్లు తెలుస్తోంది. 2023- 2024 రంజీ ట్రోఫీ సీజన్‌లో కోటియన్‌ మెరుగైన ప్రదర్శన చేశాడు. 10 మ్యాచ్‌లలో 29 వికెట్ల పడగొట్టాడు. మొత్తం 502 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది టౌర్నమెంట్‌ అవార్డు సైతం అందుకున్నాడు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *