పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గుడ్ న్యూస్ చెప్పారు. రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను (Income Tax) నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయపన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు.
బడ్జెట్ సమావేశాలు వాయిదా
మరోవైపు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Union Budget Session 2025) సోమవారానికి వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశాలు దాదాపు గంటన్నరపాటు కొనసాగాయి. వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డు క్రియేట్ చేశారు.
వచ్చే వారం ఐటీ బిల్లు
మరోవైపు ఆదాయపన్ను విషయంలో నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక ప్రకటన చేశారు. వచ్చే వారం పార్లమెంట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ (Income Tax Bill)( ప్రత్యేక వ్యక్తిగత ఆదాయపు పన్ను) బిల్లు ప్రవేశపెట్టునున్నట్లు తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వెల్లడించారు. ఇన్‌కమ్ ట్యాక్స్‌లో అనవసరపు సెక్షన్లను తొలగిస్తామని పేర్కొన్నారు.
పేదలకు యూపీఐ లింక్డ్ క్రిడిట్ కార్డులు
పట్టణ పేదల కోసం రూ.30 వేల పరిమితితో యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బీమా రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. కస్టమ్స్ చట్టంలో మార్పులు, 7 రకాల సుంకాలను తొలగిస్తామని వెల్లడించారు.






