Mana Enadu: ప్రస్తుతం టెస్టుల్లో టీమ్ఇండియా(Team India)ను రోహిత్ శర్మ(Rohit sharma) నడిపిస్తున్నాయి. అయితే రోహిత్ వయస్సు ఇప్పుడు 37 సంవత్సరాలు. అతను ఇంకా ఎక్కువకాలం క్రికెట్లో కొనసాగడం కష్టమే. అయితే అతని తర్వాత టెస్టు(Test Cricket)లో భారత జట్టును ఎవరు నడిపిస్తారనే దానిపై పెద్దయెత్తున చర్చ నడుస్తోంది. మరోవైపు రోహిత్ వారసుడి కోసం టీమ్ మేనేజ్మెంట్(Team Management) కూడా ప్రణాళికలు(Plans) సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ వారెవరో తెలుసుకుందామా..
జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)
ఒకవేళ భారత్‌కు కొత్త టెస్టు కెప్టెన్‌ని నియమించాల్సి వస్తే జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మంచి ఎంపిక. బుమ్రా మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు ఆడుతున్నాడు. పైగా అతను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ల(Best bowlers)లో ఒకడు. ఇప్పటికే అతను టెస్ట్ టీమ్‌కు వైస్ కెప్టెన్(Vice Captain)గా వ్యవహరిస్తున్నాడు. ఏ జట్టుపైనైనా, ఏ దేశంలోనైనా వికెట్లు తీయగల సత్తా బుమ్రాకు ఉంది. కాకపోతే అతను తరచూ ఫిట్ నెస్ సమస్యల(Fitness issues)తో ఇబ్బంది పడుతుంటాడు. దానిని కాపాడుకుంటే మాత్రం అతను భారత టెస్టు జట్టు పగ్గాలు అందుకునే ఛాన్సుంది. కాగా 30 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా 40 టెస్టుల్లో 173 వికెట్లు పడగొట్టాడు.
రిషభ్ పంత్(Rishabh Pant)
టీమ్ఇండియా నెక్ట్స్ టెస్టు కెప్టెన్‌గా రిషభ్ పంత్(Rishabh Pant) అత్యుత్తమ పోటీదారుగా నిలిచాడు. పంత్ టెస్ట్ ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్ కమ్ వికెట్ కీపర్(Batsman cum wicket keeper)గా అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. ఒక వికెట్ కీపర్ మైదానంలోని పరిస్థితులను ఎక్కువగా అర్థం చేసుకుంటాడు. ఏదైనా నేర్చుకోవడంలో పంత్ చాలా ముందుంటాడు. ఇప్పటికే ఇతడికి IPLలో ఢిల్లీ క్యాపిటల్స్(DC)కు కెప్టెన్‌గా చేసిన అనుభవం ఉంది. రిషభ్ పంత్ 37 టెస్టు మ్యాచ్‌ల్లో 43.54 సగటుతో 2569 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
శుభ్‌మన్ గిల్(Shubman Gill)
యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) టీమ్ఇండియా తదుపరి టెస్టు కెప్టెన్(Captain)గా ఎంపికయ్యే అవకాశం ఉంది. 25 ఏళ్ల గిల్ ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేస్తాడు. పైగా ఇతడు మరో 10-15 ఏళ్ల పాటు భారత్ తరపున క్రికెట్ ఆడగలడు. శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు 28 టెస్టు మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో సహా 1709 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ గణాంకాలు చాలా హైలో ఉన్నాయి. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్, అనుభవం అతడి సొంతం. మరి ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్‌గా అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు.








