టీమ్ఇండియా హెడ్ కోచ్(Team India Heas Coach), బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్(Gautam Gambhir)కు బెదిరింపు రెండు మెయిల్స్(Email Threats) వచ్చాయి. ఈ మేరకు గౌతమ్‌ను చంపేస్తామంటూ అందులో రాసి ఉంది. వెంటనే గంభీర్ ఢిల్లీ పోలీసుల(Delhi Police)కు ఫిర్యాదు చేశాడు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందని ఆరా తీశారు. అది ఐసిస్ కశ్మీర్(ISIS-Kashmir) నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు దీనిపై విచారణ వేగవంతం చేశారు. మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. తాజా ఉగ్రదాడి నేపథ్యంలో గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది.
రెండు ప్రపంచకప్‌లు అందుకున్నాడు..
కాగా గంభీర్ టీమ్ఇండియాకు 58 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 4154 రన్స్ చేశాడు. అలాగే 147 వన్డేలు ఆడి 5,238 పరుగులు సాధించాడు. 37 T20 మ్యాచులు ఆడిన గౌతీ 932 రన్స్ చేశాడు. భారత్ జట్టు గెలిచిన T20 వరల్డ్ కప్ 2007, వన్డే వరల్డ్ కప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో, కోల్‌కతా నైట్‌రైడర్స్ 2012, 2014లో ఛాంపియన్‌గా నిలిచింది.
గంభీర్ రాజకీయ జీవితం ఇదే..
ఇక గౌతమ్ గంభీర్ 2019 మార్చి 22న భారతీయ జనతా పార్టీ(BJP)లో చేరాడు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీపై 3,90,391 ఓట్ల మెజారిటీతో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా గెలిచాడు. ఆ తర్వా త రాజకీయాలకు దూరమయ్యాడు. ప్రస్తుతం టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.
Gautam Gambhir, has reported receiving a death threat from ‘ISIS Kashmir’. On Wednesday, he went to the Delhi Police to file a formal complaint for an FIR and requested protection for his family’s safety.😳 pic.twitter.com/CzZ3WOVYst
— Way Big (@Waay_Big) April 24, 2025






