భారత క్రికెటర్లకు షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ(Board of Control for Cricket in India) సిద్ధమైందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇందుకు కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా టీమ్ఇండియా(Team India) ప్రదర్శన చాలా పేలవంగా ఉంటోంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై టెస్టు, శ్రీలంకపై ODI సిరీస్‌ను కోల్పోయింది. అయితే ప్రపంచంలోనే ఎక్కువ మంది క్రీడాభిమానులు ఉన్నది మనదేశంలోనే.. అటు అన్ని క్రికెట్ బోర్డులలోనూ BCCIదే అప్పర్ హ్యాండ్. అలాంటిది జట్టు వరుస ఓటములు చవిచూస్తుంటే ఊరికే చూస్తూ ఉంటుందా? అందుకే బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్లేయర్ల పర్ఫార్మెన్స్(Performance of players) ఆధారంగా డబ్బు చెల్లించనున్నట్లు సమాచారం.
2019కి ముందు ఉన్న రూల్ మళ్లీ అమలు
ఇక నుంచి ఆటతీరు ప్రకారం చెల్లింపులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం పర్ఫార్మెన్స్ సరిగా లేకుంటే వారి సంపాదనలో కోత పడనుంది. ఈ నిర్ణయంతో క్రికెటర్లు అలర్ట్(Alert)గా ఉంటారని కొందరు అంటుంటే.. ఒత్తిడి(pressure) పెరుగుతుందని మరికొందరు వాదిస్తున్నారు. అలాగే విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్లు తమ కుటుంబాలతో కలిసి ఎక్కువ కాలం ఉంటే అది వారి ప్రదర్శనపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని BCCI భావిస్తోందట. అందువల్ల ఆటగాళ్లతో కుటుంబాలు గడిపే సమయాన్ని పరిమితం చేస్తూ 2019కి ముందు ఉన్న రూల్‌ని మళ్లీ ప్రవేశపెట్టాలని బోర్డు భావిస్తోన్నట్లు సమాచారం. ఇకపై ప్రతి ఆటగాడు జట్టులోని ఇతర సభ్యులతో కలిసి జట్టు బస్సులోనే ప్రయాణించాల్సి ఉంటుంది.
🚨 NEW GUIDELINES FROM BCCI. 🚨
– Cricketers’ wives will not be able to stay for the entire tour.
– A cricketer’s family can stay for a maximum of 2 weeks during a 45 day tour.
– Every player needs to travel by team bus, separate travelling not allowed. (Abhishek Tripathi). pic.twitter.com/ysCyHRguCO— Mufaddal Vohra (@mufaddal_vohra) January 14, 2025
జట్టు పనితీరుపై విమర్శల నేపథ్యంలో
తాజా నివేదిక ప్రకారం.. న్యూజిలాండ్(NZ)తో స్వదేశంలో, ఆస్ట్రేలియాతో జరిగిన BGT టెస్ట్ సిరీస్‌లను వరుసగా ఓడిపోయిన తర్వాత.. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gambhir), అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డెస్కటేతో సహా అతని మద్దతు జట్టు పనితీరుపై విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే బీసీసీఐ సహాయక సిబ్బంది(Support staff) కాంట్రాక్టులను గరిష్ఠంగా మూడేళ్లుగా నిర్ణయించింది. విమాన ప్రయాణ సమయంలో 150 కిలోల బరువు దాటితే ఆటగాళ్ల లగేజీకి BCCI చెల్లించడం మానుకోవాలని భావిస్తోందని నివేదిక(Report) పేర్కొంది.






