Rishabh Pant: వారెవ్వా పంత్.. మరో రికార్డుకు చేరువలో టీమ్ఇండియా వికెట్ కీపర్

టీమ్ఇండియా(Team India) ప్లేయర్, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఇంగ్లండ్ టూర్‌(England Tour)లో అదరగొడుతున్నాడు. లీడ్స్‌(Leads)లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు (134, 118) పంత్.. ఆ తర్వాతి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 25, 65, 74, 9 రన్స్ చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకూ 425 రన్స్‌తో సిరీస్‌లో సెకండ్ లీడింగ్ స్కోరర్‌గా ఉన్నాడు. భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌(Vice Captain)గా ఉన్న పంత్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆడటం ఖాయం. జులై 23 నుంచి మాంచెస్టర్‌(Manchester)లో మొదలుకానున్న నాలుగో టెస్టులో పంత్ 58 ఏళ్ల నాటి ఓ రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది. ఇంతకీ అందేటో ఓలుక్ వేద్దామా..

రిషభ్ మరో 101 పరుగులు చేస్తే..

ఒక టెస్టు సిరీస్‌లో హయ్యెస్ట్ రన్స్ (526) చేసిన భారత వికెట్‌కీపర్‌(Wicket-Keeper)గా పంత్‌ నిలవనున్నాడు. ఇందుకు అతడు మరో 101 పరుగులు చేస్తే చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు కుందరన్‌ పేరిట ఉంది. 1964లో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇండియాకు వచ్చింది. అప్పుడు కుందరన్‌ 10 ఇన్నింగ్స్‌ల్లో 525 రన్స్ చేశారు. ఇందులో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అంతేకాదు ఒక టెస్టు సిరీస్‌లో 500కుపైగా పరుగులు చేసిన ఏకైక భారత వికెట్‌కీపర్ కూడా కుందరనే. ఓవరాల్‌గా చూస్తే డెనిస్ లిండ్సే (South Africa) అగ్రస్థానంలో ఉన్నాడు. లిండ్సే 1966-67 మధ్య ఆస్ట్రేలియా(Australia)పై ఐదు మ్యాచ్‌ల్లో 606 పరుగులు సాధించాడు. పంత్‌ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే లిండ్సే రికార్డునూ బ్రేక్ చేయడం ఖాయం.

I Had Three Celebrations In My Mind': Rishabh Pant Reflects On His  Somersault Moment During ENG Vs IND 1st Test Match; Video

టెస్టుల్లో పంత్ అద్భుత రికార్డులివే

రిషభ్ పంత్ టెస్టు క్రికెట్‌(Test Cricket)లో అనేక అద్భుత రికార్డులు సాధించాడు. 2018లో టెస్టు అరంగేట్రం చేసిన పంత్, 2025 వరకు 44 టెస్టు మ్యాచ్‌లు ఆడి, 77 ఇన్నింగ్స్‌లలో 3200 పరుగులు చేశాడు, సగటు 44.44, స్ట్రయిక్ రేట్ 74.02గా ఉంది. అతని ఖాతాలో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే పంత్ భారత వికెట్ కీపర్‌గా అత్యధికంగా 8 టెస్టు సెంచరీలు, MS ధోని (6) రికార్డును అధిగమించాడు. ఇందులో 6 సెంచరీలు విదేశీ గడ్డపైనే కావడం గమనార్హం. అలాగే ఒకే టెస్టులో రెండు సెంచరీలు (134 & 118) చేసిన ఆసియా తొలి ప్లేయర్‌గా, ఓవరాల్‌గా రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు. కాగా మూడో టెస్టులో గాయపడిన పంత్ నాలుగో టెస్టులో ఆడేది లేనిది మ్యాచుకు ముందే తెలియనుంది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *